అతను నిర్మాత అయ్యాడేంటబ్బా?

అతను నిర్మాత అయ్యాడేంటబ్బా?

టాలీవుడ్లో ఒక విచిత్రమైన కాంబినేషన్లో సినిమా మొదలైంది. ఫ్లాపులతో అల్లాడిపోయి సక్సెస్ కోసం తపించిన పోతున్న కొందరు వ్యక్తులతో  అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఒక సినిమా మొదలుపెట్టింది. ఇప్పటిదాకా మూడు సినిమాలు చేసి మూడూ డిజాస్టర్లే ఖాతాలో వేసుకున్న అక్కినేని అఖిల్ ఈ చిత్రంలో హీరో కాగా.. ఒకప్పుడు ‘బొమ్మరిల్లు’ లాంటి మరపురాని సినిమాను అందించి, ఆపై ‘ఆరెంజ్’ నుంచి వరుస డిజాస్టర్లతో సతమతం అయిన భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇలాంటి ట్రాక్ రికార్డున్న హీరో, దర్శకుడితో గీతా ఆర్ట్స్ సినిమా చేయడం ఓ ఎత్తయితే.. ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఓ డిజాస్టర్ డైరెక్టర్‌ని పెట్టుకోవడం మరో ఎత్తు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. వాసు వర్మ.

అక్కినేని నాగచైతన్య హీరోగా పరిచయం అయిన ‘జోష్’ సినిమాతో వాసు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. తన ప్రొడక్షన్లో దర్శకుడిగా ఎవరు పరిచయమైనా హిట్ ఇవ్వకుండా బయటికి పంపనని చెప్పే దిల్ రాజు.. వాసుతో తర్వాత ‘కృష్ణాష్టమి’ అనే మరో సినిమా తీశాడు. అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఇక అతడిని ఉద్ధరించే పనిని పక్కన పెట్టేశాడు రాజు. ‘కృష్ణాష్టమి’ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వాసు వర్మ.. ఇంత కాలానికి అఖిల్-భాస్కర్ సినిమాతో వార్తల్లోకి వచ్చాడు.

ఈ చిత్రాన్ని బన్నీ వాసుతో కలిసి అతను నిర్మిస్తుండటం విశేషం. ఐతే దర్శకుడిగా దారుణంగా ఫెయిలైన దర్శకుడికి సినిమాను నిర్మించే సీన్ ఉందా అన్నది డౌట్. బహుశా వాసు ఈ చిత్రంలో పెట్టుబడి ఏమీ పెడుతుండకపోవచ్చేమో. మొత్తం ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నందుకు వాటా ఏమైనా ఇస్తున్నారేమో. గీతా ఆర్ట్స్‌లో బన్నీ వాసు ముందు నుంచి చేస్తున్న పని ఇదే. ఇప్పుడు దర్శకుడిగా కెరీర్ కనిపించని వాసు కూడా ఇలా ప్రొడక్షన్లో సెటిలైపోదామని చూస్తుండొచ్చని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English