సమంత స్థానం ఆమెదేనా?

 సమంత స్థానం ఆమెదేనా?

సమంత మాదిరిగానే చిన్న సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన రష్మిక ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాలకి ఫ్రంట్‌ రన్నర్‌గా మారింది. మహేష్‌, అల్లు అర్జున్‌ల సినిమాలకే కాకుండా యువ హీరోల చిత్రాలకి కూడా ఆమెనే అప్రోచ్‌ అవుతున్నారు. ఆమె ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. కేవలం తెలుగునాట మాత్రమే కాకుండా తమిళంలో కూడా రష్మిక హవా నడుస్తోంది. రష్మిక ఇటీవలే కార్తీ చిత్రంలో కథానాయికగా ఎంపికయింది.

తాజాగా సూపర్‌స్టార్‌ విజయ్‌ సినిమాకి ఆమెకి ఆఫరిచ్చారని తెలిసింది. అయితే తన డేట్లు అసలు ఖాళీ లేకపోవడంతో ఇప్పుడు విజయ్‌ చిత్రాన్ని చేస్తుందా లేదా అనేది కూడా తనకే తెలియనట్టుంది పరిస్థితి. కొన్ని నోలల క్రిత విజయ్‌ సినిమాలో రష్మిక హీరోయిన్‌ అనే వార్త వస్తే 'లేని పోని ఆశలు రేపకండి' అంటూ బదులిచ్చిన రష్మిక ఇప్పుడు విజయ్‌తో అవకాశం రాగానే వెంటనే డేట్స్‌ ఇవ్వలేనంత బిజీ అయిపోయింది.

సమంత తర్వాత తెలుగు, తమిళంలో ఇంతగా టాప్‌ హీరోలు పోటీ పడుతోన్న భామ ఈమెనే అనాలి. మరి సమంత మాదిరిగా అన్నేళ్ల పాటు అగ్ర తారగా కొనసాగుతుందా లేక మిగతా హీరోయిన్ల మాదిరిగా రెండేళ్లకే బోర్‌ కొట్టేస్తుందా అనేది ఇప్పుడే చెప్పడం కష్టంలెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English