తమిళ ‘బిగ్ బాస్’ షోలో సెన్సేషన్

తమిళ ‘బిగ్ బాస్’ షోలో సెన్సేషన్

బ్రిటన్ నుంచి ఉత్తర భారతానికి దిగుమతి అయి.. ఆపై దక్షిణాది ప్రేక్షకుల్ని కూడా పలకరించి ఇక్కడ కూడా విజయవంతం అయింది ‘బిగ్ బాస్’ టీవీ షో. తెలుగులో తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌లుగా వ్యవహరిస్తే.. తమిళంలో మాత్రం తొలి రెండు సీజన్లనూ లోకనాయకుడు కమల్ హాసనేే నడిపించాడు. మూడో సీజన్లో కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. అతి త్వరలోనే మూడో సీజన్ ఆరంభం కాబోతోంది. ఈ సీజన్ పార్టిసిపెంట్లకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన ఓ విషయం సంచలనం రేపుతోంది. తమిళ బిగ్ బాస్-3లో ఓ స్వలింగ సంపర్కుడు పాల్గొనబోతున్నాడన్నదే ఆ సమాచారం. కమల్ హాసన్‌తో చర్చించి షో నిర్వాహకులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారట.

కమల్ హాసన్ ఎప్పుడూ ఎంత మోడర్న్‌గా ఆలోచిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మరొకరైతే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారేమో.. ఇబ్బందిగా ఫీలయ్యేవారమో. కానీ కమల్ మాత్రం ఈ విషయంలో ఏ అభ్యంతరం వ్యక్తం చేయలేదట. ఆ స్వలింగ సంపర్కుడు ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడటానికి ఈ విషయాన్ని షో నిర్వాహకులు కావాలనే లీక్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఒక గే హౌస్‌లో ఉన్నాడంటే మిగతా పార్టిసిపెంట్లు ఎలా ఫీలవుతారు.. ఎవరైనా వెనక్కి తగ్గుతారా అన్నది చూడాలి. ఈ వార్త నిజమే అయితే మాత్రం పెద్ద సంచలనమే అవుతుంది. ఈ సీజన్ పార్టిసిపెంట్ల గురించి రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ప్రియా ఆనంద్, రాధా రవి, రమేష్ తిలక్ లాంటి ఫిలిం సెలబ్రెటీస్ మూడో సీజన్లో పాల్గొంటారని అంటున్నారు. ఇటీవలే సీజన్-3కి సంబంధించి విజయ్ టీవీ ఒక ప్రోమో రిలీజ్ చేసింది. అందులో కమల్ కనిపించడంతో మూడో సీజన్ కూడా ఆయనే నడిపించనున్నారని ఖరారైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English