ఇంకో డిజాస్టర్ ఖాతాలో పడిపోయింది

ఇంకో డిజాస్టర్ ఖాతాలో పడిపోయింది

అల్లు వారి ఆశలు ఈసారి కూడా ఫలించలేదు. అరవింద్ చిన్న కొడుకు శిరీష్‌‌కు మరోసారి బాక్సాఫీస్ దగ్గర తిరస్కారమే ఎదురైంది. అతను ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఏబీసీడీ’ బాక్సాఫీస్ పరీక్షలో నిలవలేకపోయింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి వారాంతంలో ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. కానీ సోమవారం నుంచి ఈ సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. తమ చిత్రం మండే టెస్టు పాసైందని నిర్మాత మధుర శ్రీధర్ చెబుతున్నాడు కానీ బుకింగ్స్ చూస్తే అది నిజంగా కాదని అర్థమవుతోంది. ‘ఏబీసీడీ’ స్క్రీన్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వీకెండ్ తర్వాత వస్తున్న వసూళ్లు థియేటర్ల రెంట్లకే సరిపోయేలా ఉన్నాయి. ఈ సినిమా ఇప్పుడు ఆడుతోందంటే ఆడుతోందన్నట్లుంది పరిస్థితి. అయినా డివైడ్ టాక్ తెచ్చుకున్న శిరీష్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందని ఎలా ఆశిస్తాం?

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’కి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఐతే ఒరిజినల్లో మాదిరి ఇక్కడ ఫన్ జనరేట్ కాలేదు. హీరోయిజం ఎలివేట్ చేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మాతృకకు హీరో దుల్కర్ సల్మాన్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శిరీష్‌‌‌కు అతడిలా ప్రేక్షకుల్లో ఫాలోయింగ్, పాజిటివిటీ లేదు. ఉన్నంతలో బాగానే నటించినప్పటికీ.. సినిమాకు ఎసెట్ కాలేకపోయాాడు శిరీష్. ఈ సినిమాపై ముందు నుంచి ఆశలు లేవో ఏమో.. అల్లు అరవింద్ కానీ, అల్లు అర్జున్ కానీ ఈ ప్రాజెక్టుతో అసోసియేట్ కాలేదు. శిరీష్‌ను ప్రమోట్ చేసే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి ‘శ్రీరస్తు శుభమస్తు’తో వచ్చిన గుర్తింపు అంతా శిరీష్ పోగొట్టుకున్నట్లే అయింది. ఐదు సినిమాల్లో నాలుగు డిజాస్టర్లంటే హీరోగా ఇక అతడి కెరీర్ పుంజుకోవడం చాలా కష్టమే. ఈ స్థితిలో శిరీష్ తర్వాతి సినిమా ఎలాంటిది సెట్ చేసుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English