అడివి శేష్ పెద్ద షాకే ఇవ్వబోతున్నాడు

అడివి శేష్ పెద్ద షాకే ఇవ్వబోతున్నాడు

నటుడిగా ఫెయిల్.. దర్శకుడిగా ఫెయిల్.. రచయితగా ఫెయిల్.. కెరీర్ ఆరంభంలో అడివి శేష్ పరిస్థితి ఇది. కానీ హీరో వేషాలు వదిలేసి, రైటింగ్-డైరెక్షన్ పక్కన పెట్టేసి కొంత కాలం పాటు క్యారెక్టర్, విలన్ రోల్స్ చేసుకుంటూ సాగిపోయిన అతను.. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ‘క్షణం’ సినిమాతో ఒక్కసారిగా రైజ్ అయ్యాడు. ఆ ఒక్క సినిమాతో అతడి రేంజే మారిపోయింది. ఇక ‘గూఢచారి’తో ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేశాడు శేష్. ఈ రెండు సినిమాల ద్వారా యాక్టింగ్‌తో పాటు పెన్ పవర్ కూడా చూపించాడు శేష్. ఇప్పుడు శేష్ అనే పేరుకే ఒక బ్రాండ్ వాల్యూ వచ్చేసింది. అతడి కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అతను ‘గూఢచారి-2’తో పాటు ‘మేజర్’ అనే మరో థ్రిల్లర్ మూవీని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఐతే ఈ రెండు సినిమాల్లో ఏదీ ముందుకు కదిలినట్లుగా కనిపించలేదు. శేష్ ‘గూఢచారి-2’ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నట్లుగా కనిపించాడు. ‘2 స్టేట్స్’ రీమేక్ కూడా మధ్యలో ఆగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది శేష్ నుంచి సినిమా ఉండదనే అంతా అనుకున్నారు. కానీ శేష్ ప్రేక్షకులకు సడెన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఈ మధ్యే ట్విట్టర్లో శేష్ తాను ఒక డిఫరెంట్‌ లుక్‌తో ఉన్న ఫొటో షేర్ చేసి సీక్రెట్ మిషన్ అంటూ అప్ డేట్ ఇచ్చాడు. ఇంతకీ ఈ సీక్రెట్ మిషన్ ఏంటి అంటే.. శేష్ చడీచప్పుడు లేకుండా ఓ థ్రిల్లర్ మూవీ చేేసేశాడట. ‘క్షణం’ నిర్మాత పీవీపీ ఈ సినిమాను నిర్మించినట్లు సమాచారం. ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రెజీనా కసాండ్రా కథానాయికగా నటించిందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నాడు శేష్. ఇంకో నెలా రెండు నెలల్లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English