ప్రభాస్‌కి ఎక్కడ మొదలెట్టాలో తెలీడం లేదు

ప్రభాస్‌కి ఎక్కడ మొదలెట్టాలో తెలీడం లేదు

బాహుబలి చిత్రానికి ప్రభాస్‌ కేవలం నటించేసి మిగతా భారమంతా రాజమౌళిపై వదిలేసాడు. ఆ చిత్రానికి క్రేజ్‌ తెచ్చి పెట్టడంలో రాజమౌళి బృందం అనన్య సామాన్యమైన కృషి చేసింది. బాహుబలి ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ అయిన నాటినుంచీ దానిని ఇతర భాషలలో మార్కెట్‌ చేయడంలో రాజమౌళి టీమ్‌ సక్సెస్‌ అయింది. సాహోకి వచ్చేసరికి రాజమౌళి సాయం లేక ప్రభాస్‌ టీమ్‌కి దీనిని ఎలా ప్రమోట్‌ చేసుకోవాలనేది తెలియడం లేదు. తెలుగునాట ఈ చిత్రానికి క్రేజ్‌ ఎలాగో వుంటుంది కానీ ఇతర మార్కెట్ల మాటేమిటి?

కేవలం బాహుబలి హీరో చేసిన సినిమాగా దీనిని ప్రమోట్‌ చేయడం జరగని పని. ఇతర మార్కెట్లలో క్రేజ్‌ ఎలా తీసుకు రావాలనేది ప్రభాస్‌తో పాటు దర్శకుడు సుజీత్‌కి కూడా క్లూ లేదు. యువి క్రియేషన్స్‌కి కూడా నేషనల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేయడం అలవాటు లేదు. సాహోని దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో పెట్టడానికి పలుమార్లు కృషి చేసినా కానీ ఇంతవరకు ఏదీ క్లిక్‌ అవలేదు. బాహుబలికి ఏ పోస్టర్‌ విడుదల చేసినా కానీ జాతీయ వ్యాప్తంగా ట్రెండ్‌ అయ్యేది. అలాంటి క్రేజ్‌ దీనికి తేవడం ఎలాగనేది సాహో టీమ్‌కి అంతు చిక్కడం లేదని గుసగుసలాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English