పవన్‌ కళ్యాణ్‌ ఫాన్స్‌కి నిద్ర లేని రాత్రి!

పవన్‌ కళ్యాణ్‌ ఫాన్స్‌కి నిద్ర లేని రాత్రి!

పవన్‌కళ్యాణ్‌ సినిమా ఎలా వుంటుందనే ఆందోళనతో అభిమానులు పలుమార్లు నిద్ర లేని రాత్రులు గడిపి వుంటారు. కానీ ఈసారి అందుకు విభిన్నమైన ఎమోషన్‌తో ఫాన్స్‌ టెన్షన్‌కి గురవుతున్నారు. రాజకీయాల్లోకి నేరుగా అడుగుపెట్టి, దాదాపుగా అన్ని స్థానాల నుంచి పోటీ చేసి, సొంత బలమెంతో తెలుసుకోవడం కోసం ప్రజాతీర్పుకోసం వెళ్లిన జనసేనానికి ఎలాంటి అనుభవం ఎదురు కానుంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో పవన్‌ ప్రభావం సున్నా అనే వాళ్లే చాలా మంది వున్నారు. చివరకు పవన్‌ కూడా గెలవడని పలువురు తేల్చి చెప్పేసారు.

అయితే కొత్త పార్టీల ప్రభావాన్ని అంచనా వేయడం ఎగ్జిట్‌ పోల్స్‌ వల్ల కాదనేది గతంలో పలుమార్లు తేలిపోయింది కనుక దానిని పట్టించుకోవాల్సిన పని లేదు. కాకపోతే మరి కొద్ది గంటల్లో ప్రజా తీర్పు ఏమిటనేది తెలియబోతోంది. పవన్‌కళ్యాణ్‌ పార్టీ ఏమి సాధించినా కానీ అది ఎస్సెట్టే. కానీ ఒకవేళ సీట్లు ఎక్కువ రాకపోతే పవన్‌ని ఫ్లాప్‌గా ముద్ర వేయడానికి వ్యతిరేక మీడియా కాచుకుని కూర్చుంది. అలాగే పవన్‌ని ఎద్దేవా చేయడానికి ఇతర హీరోల అభిమానులు కూడా ఫలితాల కోసం ఆత్రుతగా చూస్తున్నారు. రేపు ఎలా వుంటుందోననే భయంతో, ఆందోళనతో పవన్‌ ఫాన్స్‌ ఈ రాత్రి జాగారం చేయక మానరు. రాజకీయాల్లోను పవర్‌స్టార్‌ సత్తా చాటుకోవాలనే ఆశిద్దాం. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English