అల్లు అర్జున్‌ తర్వాత నేనే: బెల్లంకొండ

అల్లు అర్జున్‌ తర్వాత నేనే: బెల్లంకొండ

బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఇక్కడ విజయాలు దక్కడం లేదు కానీ హిందీ మార్కెట్‌ తనకి బాగా వుందని పదే పదే చెబుతుంటాడు. తన సినిమాలకి హిందీలో గిరాకీ బాగా వుంటుందని బెల్లంకొండ శ్రీను ఇంతకుముందు కూడా చెప్పాడు. ఈసారి ఒక అడుగు ముందుకేసి అల్లు అర్జున్‌ తర్వాత హిందీ ఆడియన్స్‌ తన సినిమాలనే ఎగబడి చూస్తుంటారని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అందుకే తన సినిమాలలో వారికి నచ్చే అంశాలు వుండేలా చూసుకుంటానని కూడా అన్నాడు. నిజంగానే అతని సినిమాలకి అక్కడ వ్యూస్‌ బాగానే వస్తున్నాయి కానీ అది తెలుగు సినిమాలలో చాలా వాటికి జరుగుతోంది.

అజ్ఞాతవాసి చిత్రానికి కూడా లక్షల కొద్దీ వ్యూస్‌ వచ్చేసాయి కనుక అది సూపర్‌ సినిమా అనుకుంటే ఎలా? అలాగే వారికి నచ్చే అంశాలు వుండాలని చూసుకుంటూ తెలుగు ప్రేక్షకులకి ఏమి కావాలనేది మాత్రం ఈ కుర్ర హీరో తెలుసుకోలేకపోతున్నాడు. అలాగే హిందీ చిత్రాలకి తన వాయిస్‌ కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ వుండడం వల్ల ప్లస్‌ అవుతుందేమో అనేది కూడా బెల్లంకొండ తర్కించుకోవాలేమో అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English