'సీత'లో ఇనప గజ్జెల తల్లి!

'సీత'లో ఇనప గజ్జెల తల్లి!

హీరోయిన్లలో అసలు సక్సెస్సే లేని వారిని ఇండస్ట్రీ ఐరెన్‌లెగ్‌ అనేస్తుంది. అలా ఇంతవరకు నటించిన అన్ని సినిమాలతోను ఫ్లాప్‌లే చవిచూసిన మన్నర చోప్రాకి కూడా ఇనప గజ్జెల తల్లి అనే ట్యాగ్‌ వచ్చేసింది. ఇంతవరకు మన్నర నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లే. తిక్క, రోగ్‌, జక్కన్న లాంటి కళాఖండాలలో మన్నర నటించింది. ఇతర భాషల్లో ఆమె చేసిన చిత్రాలు కూడా సిమిలర్‌ ఫలితాలు చవిచూసాయి. దీంతో ఆమెకి ఐరెన్‌ లెగ్‌ అనే బ్రాండ్‌ పడడంతో అందాల ఆరబోత విషయంలో అరమరికలు లేకపోయినా అవకాశాలయితే రావడం లేదు.

సీతలో సెకండ్‌ హీరోయిన్‌గా మన్నరకి తేజ అవకాశమిచ్చాడు. ఈ సీత తన రాత మారుస్తుందని మన్నర ఆశిస్తోంటే, ఈమె వుంది కదా ఇక సినిమా రిజల్ట్‌పై డౌట్లు కూడా అక్కర్లేదని సినీ జనం సెటైర్లు వేస్తున్నారు. అయితే శృతిహాసన్‌ లాంటి హీరోయిన్లు మొదట్లో ఇలాంటి కామెంట్లే ఎదుర్కొని తర్వాత గబ్బర్‌సింగ్‌, రేసుగుర్రం లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చారు. అలాగే మన్నరకి కూడా అదృష్టం కలిసి వచ్చి సీతతో సుడి తిరుగుతుందేమో ఎవరు చూడవచ్చారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English