మహేష్‌ మాట నిలబెట్టుకుంటాడా?

మహేష్‌ మాట నిలబెట్టుకుంటాడా?

వంశీ పైడిపల్లిపై తాను కురిపిస్తోన్న ప్రశంసలు కేవలం సినిమా ప్రచారం కోసం కాదని, నిజంగానే అతని ప్రతిభ తనకి బాగా నచ్చిందని చెప్పడానికి మహేష్‌ తపిస్తున్నట్టున్నాడు. అందుకే వంశీ పైడిపల్లితో మరో సినిమా చేస్తానని మహేష్‌ మాటిచ్చాడట. మరి నిజంగానే మహేష్‌ మాట ఇచ్చాడో లేక ఇలా తనకి తాను వంశీ పైడిపల్లి ఎలివేషన్‌ ఇచ్చుకుంటున్నాడో తెలియదు.

ఏదేమైనా ఈ దర్శక-కథానాయక ద్వయం అయితే ఈమధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు. దర్శకుడిని హీరో ముద్దు పెట్టుకోవడం, తర్వాత ఒకరి భుజాలని ఒకరు తట్టుకుంటూ ట్వీట్లు వేసుకోవడం చూసి అభిమానులు కూడా చికాకు పడ్డారు. సినిమా హిట్టని నమ్మించడానికి ఇన్ని ప్రయత్నాలు అవసరం లేదంటూ మహేష్‌ మీద కూడా సెటైర్లు వేసారు.

మహేష్‌ ఇప్పటికే చాలా మంది దర్శకులని లైన్లో పెట్టాడు. కనీసం రెండేళ్ల పాటు మహేష్‌ని మరో దర్శకుడికి దొరకకుండా చేయడానికి రాజమౌళి సినిమా కూడా వుండనే వుంది. మరి ఈ రద్దీలో మహర్షి దర్శకుడికి మళ్లీ అవకాశం దక్కేది ఎన్నటికో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English