సాహో దర్శకుడికి ధైర్యం చాలట్లేదా?

సాహో దర్శకుడికి ధైర్యం చాలట్లేదా?

మూడు వందల కోట్లకి పైగా విలువ చేసే సాహో లాంటి చిత్రానికి కొమ్ములు తిరిగిన రాజమౌళిలాంటి దర్శకుడు వుండాలి. కానీ కనీసం పది కోట్ల బడ్జెట్‌ని కూడా హ్యాండిల్‌ చేసి ఎరుగని సుజీత్‌ చేతిలో ఈ సినిమా పెట్టారు. దర్శకుడిగా తన పని ఎలా చేసాడనేది సినిమా చూస్తే కానీ చెప్పలేం. అయితే అంతకుముందు తన కాన్ఫిడెన్స్‌ని చాటుకునే విషయంలో మాత్రం సుజీత్‌ బాగా డిజప్పాయింట్‌ చేస్తున్నాడు. సాహో చిత్రాన్ని ఎలా ప్రమోట్‌ చేయాలనేది అతనికి తెలియడం లేదు.

ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి మేకింగ్‌ వీడియోలు మాత్రమే విడుదల చేసారు. పోస్టర్స్‌కి వచ్చేసరికి అసలు ఒరిజినాలిటీ కనిపించడం లేదు. ఆంగ్ల చిత్రాల పోస్టర్లని కాపీ కొడుతూ సాహోని స్టాండ్‌ అవుట్‌ సినిమాగా నిలబెట్టలేకపోతున్నాడు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి చెందినది అని చూపించే తపనలో హాలీవుడ్‌ సినిమాల పోస్టర్లనే కాపీ కొడుతున్నాడు. ఈ చిత్రానికి తన సొంత ఆలోచనలతో పోస్టర్‌ వదిలితే అదెక్కడ క్లిక్‌ అవదోననే భయం అయితే సుజీత్‌లో బాగా కనిపిస్తోంది.
పోస్టర్లు సొంతంగా ఆలోచించడానికే ఇంత భయపడుతోన్న దర్శకుడు సినిమాలో పూర్తిగా తన టాలెంట్‌నే నమ్ముకున్నాడా లేక నచ్చిన సీన్లని కాపీ కొట్టేసాడా అనే అనుమానాలకి కూడా ఇది తావిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English