మన డైరెక్టర్లని తొక్కేస్తున్నారు

మన డైరెక్టర్లని తొక్కేస్తున్నారు

బాలీవుడ్‌నుంచి కబురొచ్చిందనగానే దర్శకులుగా తమ టాలెంట్‌ని దేశమంతటికీ చూపించవచ్చునని హిందీ చిత్రాలకి దర్శకత్వం వహించాలని మన దర్శకులు ఉబలాట పడుతున్నారు. అయితే బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొందరు హేమాహేమీలైన దర్శకులకి తప్ప మిగతా వాళ్లకి 'కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌' హోదా వుండదు. పేరు ఎవరిది వేసినా దర్శకత్వం హీరోలే చేసేస్తూ వుంటారు.

'మణికర్ణిక' చిత్రానికి క్రిష్‌ని కంగన రనౌత్‌ ఎంత దారుణంగా అవమానించిందో తెలిసిందే. అతను తీసిన సినిమాలో కొన్ని సీన్లు తనకి కావాల్సినట్టు తీసుకుని, కొంత ప్యాచ్‌వర్క్‌ షూట్‌ చేసి దర్శకురాలిగా క్రెడిట్‌ తీసుకోవడమే కాకుండా క్రిష్‌ని బదనాం చేసింది. తాజాగా లారెన్స్‌కి బాలీవుడ్‌ ట్రీట్‌మెంట్‌ ఏమిటో తెలిసి వచ్చింది. దర్శకుడిగా తనని ఎంచుకుంటే తన టాలెంట్‌ చూసి గౌరవంతో తనకి అవకాశమిచ్చారని అనుకున్నాడు. కానీ తనని కీలుబొమ్మగా వాడుకోబోతున్నారని లారెన్స్‌ ముందుగా గ్రహించి డ్యామేజ్‌ ఎక్కువ జరగకుండానే తప్పించుకున్నాడు.

దర్శకుడు సినిమాని వదిలేస్తున్నట్టు ప్రకటించినా అటు హీరో అక్షయ్‌ కుమార్‌కి గానీ, ఇటు ఆ చిత్ర నిర్మాతలకి కానీ అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి అనుభవాలు చూసాక అయినా బాలీవుడ్‌ నుంచి పిలుపు రాగానే ఎగిరి గంతేసి వెళ్లిపోకుండా తమ  ప్రతిభకి తగ్గ మర్యాద లభిస్తుందనే నమ్మకం కుదిరాకే అటు వైపు వెళితే బాగుంటుంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English