అల్లు శిరీష్‌ రిజెక్టడ్‌ అగైన్‌!

అల్లు శిరీష్‌ రిజెక్టడ్‌ అగైన్‌!

అల్లు శిరీష్‌ని హీరోగా నిలబెట్టే ప్రయత్నాలని అల్లు అరవింద్‌ అయితే మానలేదు. ఏదో ఒక విధంగా అతడిని ప్రేక్షకుల ముందుకి తెస్తూనే వున్నారు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తుతో కొద్దిగా కుదురుకున్నట్టే అనిపించినా కానీ అతనికి ఎలాంటి సినిమాలు బెస్ట్‌ అనే విషయంలో అల్లు అరవింద్‌ లాంటి స్ట్రాటజిస్ట్‌కి కూడా క్లారిటీ రాలేదు.

అందుకే కాంటెంపరరీ సినిమా అంటూ ఒక్క క్షణం చేయించారు. కానీ ఆ చిత్రం ఫ్లాపయింది. ఆ తర్వాత మరోసారి యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం ఏబిసిడిలో చేయించగా అదీ బెడిసికొట్టింది. ఏబిసిడి ఫ్లాప్‌ అవడంతో అల్లు శిరీష్‌ని ప్రేక్షకులు మరోసారి రిజెక్ట్‌ చేసినట్టయింది. ఫ్లాప్‌ సంగతి అలా వుంచితే ఈ చిత్రానికి దర్శకుడికి పూర్తి స్వేఛ్ఛనివ్వకుండా అన్నిట్లో శిరీష్‌ కలగజేసుకున్నాడనే టాక్‌ వచ్చింది.

పవన్‌ సాదినేని అనే దర్శకుడిని పిలిపించి క్లయిమాక్స్‌ తనకి నచ్చినట్టుగా మార్పించుకున్నాడట. అన్నిట్లోను ఇన్‌వాల్వ్‌ అవుతూ ఎవరి పని వారిని చేసుకోనివ్వలేదట. అల్లు అరవింద్‌ తనయుడు కావడంతో అతడిని ఎదిరించడానికి ఆ కొత్త దర్శకుడికి ధైర్యం చాల్లేదట. కానీ సినిమా పోవడం వల్ల ఆ కుర్రాడి కెరియరే ఇప్పుడు ఎటూ కాకుండా పోయిందిగా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English