‘ఓ బేబీ’ పోస్టర్ మీద ఆ పేరు చూశారా?

 ‘ఓ బేబీ’ పోస్టర్ మీద ఆ పేరు చూశారా?

కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది సమంత. ఆల్రెడీ ‘యు టర్న్’ చేసిన ఆమె.. ఇప్పుడు ‘ఓ బేబీ’తో పలకరించబోతోంది. ఇవి రెండూ పెళ్లయిన తర్వాత చేసిన సినిమాలే కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రశంసలందుకుని, పెద్ద విజయం సాధించిన కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి ఇది రీమేక్ కావడం విశేషం.

ఈ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ‘సురేష్ ప్రొడక్షన్స్’ బేనర్‌ మొదలై 55 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిన్ననే ‘ఓ బేబీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సీనియర్ నటి లక్ష్మి బ్యాగ్రౌండ్లో కనిపిస్తుండగా.. చాలా మోడర్న్‌ లుక్‌లో చీర్ ఫుల్‌గా ఉన్న సమంత చిత్రంతో ఆకర్షణీయంగా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. పోస్టర్ మీద టెక్నీషియన్లందరి వివరాలూ వేశారు.

నిర్మాతలుగా సురేష్ బాబు, సునీత తాటి, విశ్వప్రసాద్‌లతో పాటుగా ఒక ఆసక్తికర పేరు కనిపించింది. అదే.. హ్యున్ థామస్ కిమ్. ఈ పేరు చూడగానే అతను ఇండియన్ కాదన్న విషయం అర్థమైపోతుంది. ‘ఓ బేబీ’ మాతృక ‘మిస్ గ్రానీ’ నిర్మాతల్లో అతనొకడు కావడం విశేషం. ఒకప్పుడు అంతర్జాతీయ చిత్రాల్ని చడీచప్పుడు లేకుండా కాపీ కొట్టి సినిమాలు లాగించేసేవాళ్లు కానీ.. ఈ మధ్య పరిస్థితి చాలా మారింది. అఫీషియల్‌గా రీమేక్ హక్కులు కొని సినిమాలు చేస్తున్నారు. ‘ఊపిరి’ కూడా ఆ కోవలోనిదే. ఐతే ఒరిజినల్ నిర్మాతను రీమేక్‌లో భాగస్వామిని చేయడం మాత్రం అరుదైన విషయమే.

కేవలం గౌరవంతో అతడి పేరును పోస్టర్ మీద వేశారా.. లేక నిజంగానా సినిమాలో ఆయనకు వాటా ఉందా అన్నది తెలియదు. కానీ ఇలా ఓ తెలుగు సినిమా పోస్టర్ మీద విదేశీ నిర్మాత పేరు పడటం మాత్రం చిత్రమైన విషయమే. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English