చిరంజీవి.. నారాయణమూర్తి.. ఒక జిలేబి

చిరంజీవి.. నారాయణమూర్తి.. ఒక జిలేబి

దర్శక రత్న దాసరి నారాయణరావు మరణానంతరం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాడు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఒకప్పుడు దాదాపుగా దాసరి పోషించిన పాత్రనే ఇప్పుడు చిరు పోషిస్తున్నాడు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎవరు ఏ వేడుకకు పిలిచినా.. వీలు చూసుకుని వెళ్తున్నారు. తన వంతు తోడ్పాటు అందిస్తున్నారు. అవసరమైన చోట ఆర్థిక సాయాలు కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కొత్త సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఆడియో వేడుకకు హాజరు కావడం విశేషం. చిరు స్థాయికి నారాయణమూర్తి సినిమా వేడుకకు రావడం ఆశ్చర్యకరమే. నారాయణమూర్తి కూడా చిరును పిలవడమూ చిత్రమే.

పీపుల్స్ స్టార్ పిలవగానే మరో ఆలోచన లేకుండా ఈ వేడుకకు హాజరై.. ఆయన గురించి మంచి మాటలు మాట్లాడాడు చిరు. నారాయణమూర్తి కష్టాన్ని నమ్ముకుని, ఒక దీక్షతో పోరాడి ఈ రోజు జనాలతో పీపుల్స్ స్టార్ అనిపించుకున్నాడని.. ఆయనంటే తనకెంతో గౌరవం అని చిరు అన్నాడు. చిరు గురించి నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఏఎన్నార్ తర్వాత తెలుగు సినిమాల్లో డ్యాన్సుల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఘనత చిరుదే అన్నారు. ఈ వేడుక తర్వాత చిరు, నారాయణమూర్తితో కలిసి జిలేబి, పకోడి, బిస్కెట్లు తిన్నాడు. ఇందులో విశేషం ఏముందని అనుకోవచ్చు. అది లోకల్‌గా తెప్పించిన మామూలు ఫుడ్. మామూలుగా పెద్ద స్టార్లు ఇలాంటివి తినడానికి ఇష్టపడరు. వాటిని ముట్టుకోను కూడా ముట్టుకోరు. చిరు అలాంటిదేమీ లేకుండా అందరితో కలిసి అన్నీ తిని మామూలు నీళ్లే తాగి అందరినీ ప్రేమగా పలకరించి అక్కడి నుంచి నిష్క్రమించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English