సంక్రాంతి రేసులోకి సడెన్ సర్ప్రైజ్

సంక్రాంతి రేసులోకి సడెన్ సర్ప్రైజ్

తెలుగు సినిమాల వరకు సంక్రాంతి సీజన్‌కు ఉన్నంత క్రేజ్, డిమాండ్ ఇంకే సీజన్లోనూ ఉండదు. ఒకేసారి మూణ్నాలుగు పెద్ద సినిమాల్ని రిలీజ్ చేసుకునే సౌలభ్యం అప్పుడు మాత్రమే ఉంటుంది. మిగతా సీజన్లతో పోలిస్తే వసూళ్లు కూడా అప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అందుకే డిమాండ్ ఎక్కువ. ఈ డిమాండ్‌ కారణంగా చాలా ముందుగా సంక్రాంతి బెర్తులు బుక్ అయిపోతుంటాయి. ఈసారి సమ్మర్ సీజన్ కూడా ముగియకముందే వచ్చే సంక్రాంతికి బెర్తులు బుక్ చేసుకుంటుండటం విశేషం. ఆల్రెడీ నాలుగు సినిమాలు సంక్రాంతి రేసులో ఉండగా.. ఇప్పుడు ఐదో సినిమా కూడా చేరినట్లు వార్తలొస్తున్నాయి. అది చాలా భారీ చిత్రమే కావడం విశేషం.

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతోందట. ముందు ఈ సినిమాను దసరాకే అనుకున్నారు. కానీ షూటింగ్ కొంచెం ఆలస్యంగా మొదలవడం.. దసరా సమయానికే మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ రిలీజయ్యేలా ఉండటంతో రిలీజ్ డేట్ మార్చుకున్నారట. 2020 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారట. ఇప్పటికే ఆ సీజన్‌కు మూడు సినిమాలు ఖరారయ్యాయి. మహేష్ బాబు-అనిల్ రావిపూడి చిత్రంతో పాటు బాలయ్య-కె.ఎస్.రవికుమార్ మూవీ, సాయిధరమ్ తేజ్-మారుతి చిత్రాల్ని వచ్చే సంక్రాంతికి అనుకుంటున్నారు. బన్నీ సినిమా ఖరారైతే తేజు చిత్రాన్ని రేసు నుంచి తప్పించే అవకాశాలున్నాయి. మరోవైపు రజనీకాంత్-మురుగదాస్ కలయికలో తెరకెక్కుతున్న ‘దర్బార్’ డబ్బింగ్ వెర్షన్ కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English