టాలీవుడ్ కరణ్ జోహార్ అనిపించుకుంటాడట

టాలీవుడ్ కరణ్ జోహార్ అనిపించుకుంటాడట

ఆడియో కంపెనీ యజమానిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. తర్వాత సినిమాలు నిర్మించాడు. దర్శకుడిగానూ మారాడు. మళ్లీ ఇప్పుడు దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చి నిర్మాతగా కొనసాగుతున్నాడు. మధుర శ్రీధర్‌ది టాలీవుడ్లో విచిత్రమైన జర్నీ. ఇప్పటిదాకా ఆయన ఎందులోనూ పెద్ద సక్సెస్ చూడలేదు. ‘స్నేహగీతం’ లాంటి రీజనబుల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీధర్.. ఆ తర్వాత తీసిన రెండు సినిమాలతోనూ ఎదురు దెబ్బలు తిన్నాడు. ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ శ్రీధర్‌ను బ్యాక్ బెంచ్‌లోకి నెట్టేసింది. దీంతో దర్శకత్వం పక్కన పెట్టి ప్రొడక్షన్ మీదే దృష్టిపెడుతున్నాడు. ఐతే నిర్మాణంలోనూ ఆయనకు కలిసి రావడం లేదు. ఆయన నిర్మించిన ‘ఒక మనసు’.. ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాల పరిస్థితేంటో తెలిసిందే. ఈ రెండు చిత్రాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘ఏబీసీడీ’ సినిమా నిర్మించాడు. ఈ చిత్రం డివైడ్‌ టాక్‌తో ఏదో అలా అలా నడుస్తోంది.

ఐతే శ్రీధర్ మాత్రం ‘ఏబీసీడీ’ హిట్ అంటున్నాడు. దీనికి మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు బాగున్నట్లు చెప్పాడు. టార్గెట్ ఆడియన్స్‌ను మెప్పిస్తూ సినిమా హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తోందన్నాడు. దర్శకత్వం మానేశారేంటని ఆయన్ని అడిగితే.. ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ పరాజయం తన కాన్ఫిడెన్స్‌ను దెబ్బ తీసిందన్నాడు. ఆ తర్వాత తానే కావాలనే బ్రేక్ తీసుకున్నానన్నాడు. తనను ఇన్‌స్పైర్ చేసే కథలు కూడా దొరక్కపోవడంతో మళ్లీ సినిమా తీయలేదన్నాడు. నిర్మాతగా తనకు బాలీవుడ్ లెజెండ్ కరణ్ జోహార్ స్ఫూర్తి అని చెప్పాడు శ్రీధర్. ఆయన తన మనసుకు నచ్చిన కథలతో ఎఫ్పుడో ఒకసారి డైరెక్షన్ చేస్తూ.. మంచి క్రేజీ ప్రాజెక్టుల్ని ప్రొడ్యూస్ చేస్తాడన్నాడు శ్రీధర్. అదే తరహాలో తాను కూడా ఎప్పుడో ఒకసారి డైెరెక్షన్ చేస్తూ క్రేజీ సినిమాల్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. తన ప్రొడక్షన్లో వస్తున్న తర్వాతి సినిమా ‘దొరసాని’ జులై 5న రిలీజవుతుందని శ్రీధర్ తెలిపాడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English