మిస్టర్ 60... మిస్ 28.. వీళ్ల రొమాన్స్ ఏమవుతుందో?

మిస్టర్ 60... మిస్ 28.. వీళ్ల రొమాన్స్ ఏమవుతుందో?

ఈ రోజుల్లో సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం పెద్ద కష్టమైపోతోంది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా 30వ పడిలో పడితే వాళ్ల కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. కొన్నేళ్లలో కనుమరుగైపోతారు. కానీ హీరోలు అలా కాదు. ఎంత వయసు వచ్చినా సినిమాలు చేస్తూనే పోతుంటారు. పైగా మన వాళ్లు వయసుకు తగ్గ పాత్రలు చేయరు. ఇంకా కుర్రాళ్లలాగే కనిపించాలనుకుంటారు. అలాంటపుడు మరీ యంగ్ హీరోయిన్లను వాళ్ల పక్కన జోడీగా పెట్టడం కష్టమవుతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోలు పడుచు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే చెల్లిపోయింది కానీ.. ఈ రోజుల్లో అది కష్టం. అందువల్లే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాాంటి హీరోలకు కథానాయికల్ని సెట్ చేయడం కష్టమవుతోంది. కొంచెం పెద్ద వయసు హీరోయిన్లనే సాధ్యమైనంత వరకు సెట్ చేయాలని చూస్తున్నారు కానీ.. అన్నిసార్లూ అది కుదరదు.

దీంతో తమ కొడుకులతో జట్టు కట్టిన హీరోయిన్లతోనే తండ్రులు రొమాన్స్ చేయాల్సిన ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. రామ్ చరణ్‌తో నటించిన కాజల్ అగర్వాల్‌తో చిరు ‘ఖైదీ నంబర్ 150’లో జోడీ కట్టాడు. నాగార్జున సైతం ఇదే బాటలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’లో చైతూతో రొమాన్స్ చేసిన రకుల్ ప్రీత్‌ను ‘మన్మథుడు-2’ కోసం కథానాయికగా ఎంచుకున్నాడు. నాగ్ వయసు 60కి దగ్గరగా ఉండగా.. రకుల్‌కు 28 ఏళ్లు మాత్రమే. ఐతే చిరు-కాజల్ జోడీని చూడటంలో ఉన్న ఇబ్బందే నాగ్-రకుల్ జంటను చూడటంలోనూ తలెత్తుతోంది. వీళ్లిద్దరూ హీరో హీరోయిన్లు అంటేనే ఏదో ఒక ఇబ్బందికర ఫీలింగ్ వచ్చేసింది జనాలకు. ఇక షూటింగ్ సందర్భంగా మేకింగ్ స్టిల్స్‌లో ఈ జోడీని చూస్తున్నా ఏదోలా అనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఒక స్టిల్‌లో నాగ్, ఒడిలో రకుల్ పడుకుని ఉంది. నాగ్‌కు ఏదో మేకప్ వేసి మేనేజ్ చేసినా కూడా ఆయన ముందు రకుల్ చిన్న పిల్లలా ఉంది. ఆయనకు, రకుల్‌కు కెమిస్ట్రీ కుదరలేదు. వీళ్లిద్దరూ హీరో హీరోయిన్లలా అనిపించడం లేదు. ఏదో తేడా కొడుతున్నట్లే ఉంది. మరి ఇలాంటి ఫీలింగ్‌తో సినిమా చూసే జనాల పరిస్థితి ఏంటన్నది చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English