బిగ్‌బాస్‌ హౌస్‌లో సెక్సీ భామల సందడి

బిగ్‌బాస్‌ హౌస్‌లో సెక్సీ భామల సందడి

గత యేడాది బిగ్‌బాస్‌ వన్‌ సైడెడ్‌ అయిపోయి విజేత ఎవరనేది మూడు వారాలకే తెలిసిపోవడంతో ఈసారి అలా విజేత ఎవరనేది ఊహించలేని విధంగా గేమ్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. మసాలా డోస్‌ తగ్గకుండా సెక్సీ భామలని సైన్‌ అప్‌ చేస్తున్నారు. హాట్‌ యాంకర్‌ శ్రీముఖి ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెడుతుందట. పటాస్‌ షో నుంచి ఆమె వైదొలగడంతోనే ఇది లాంఛనమని తేలిపోయింది. అలాగే సినిమా వాళ్లతో తరచుగా కనిపించే బ్యాడ్మింటన్‌ తార జ్వాలా గుత్తాకి కూడా బిగ్‌బాస్‌ నుంచి కబురు వచ్చిందట.

ఆమెకి సెక్సీ భామగా కుర్రకారులో మంచి ఫాలోయింగ్‌ వుంది. ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో పెళ్లయిన లేడీస్‌ ఎక్కువ లేకుండా చూసుకుంటున్నారట. తద్వారా హౌస్‌లో లవ్‌స్టోరీస్‌ నడిపించడానికి ఎక్కువ ఆస్కారముంటుందని భావిస్తున్నారట. అలాగే కంటెస్టెంట్లు చాలా పాపులర్‌ వాళ్లు వుండాలని నాగార్జున ఆంక్ష విధించడంతో కాస్త ఖర్చయినా అందరూ పేరున్న వాళ్లనే తీసుకొస్తున్నారట. మగాళ్లలో వరుణ్‌ సందేశ్‌, వైవా హర్ష లాంటి వారు ఫైనల్‌ లిస్ట్‌లో వున్నారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English