ఈ గాలానికి మహేష్‌ పడతాడా?

ఈ గాలానికి మహేష్‌ పడతాడా?

మహేష్‌కి ఒక స్టోరీ లైన్‌ చెప్పి ఓకే చేయించుకుని వచ్చాడు దర్శకుడు పరశురామ్‌. గీత గోవిందంతో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన పరశురామ్‌ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ఒక స్టోరీ రెడీ చేసాడు. చిన్న రేంజ్‌ హీరోలతో కాదని స్టార్‌ హీరో కోసమే అతను పట్టుబట్టి ఎదురు చూసాడు. అల్లు అర్జున్‌ బిజీగా వుండడంతో కొరటాల శివ ద్వారా మహేష్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుని అతనికి కథ చెప్పి మెప్పించాడు. అయితే ఈ చిత్రాన్ని మహేష్‌ 'గీతా ఆర్ట్స్‌'లో చేయాల్సి వస్తుంది. పరశురామ్‌కి గీతా ఆర్ట్స్‌తో మూడు సినిమాలకి డీల్‌ వుండడంతో అతను ఈ చిత్రాన్ని కూడా గీతాలోనే చేయాలి. కానీ మహేష్‌కి వేరే నిర్మాతలతో కమిట్‌మెంట్స్‌ వున్నాయి.

అందులోను గీతా వర్కింగ్‌ స్టయిల్‌ గురించి తెలుసు కనుక వారితో కమిట్‌మెంట్‌కి మహేష్‌ అంత ఆసక్తిగా లేడని వినిపిస్తోంది. అయితే మహేష్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పొందిన స్టోరీ లైన్‌ని అతను వదిలి పెట్టలేనంత సాలిడ్‌గా తయారు చేయించి ఫుల్‌ బౌండ్‌ స్క్రిప్ట్‌ వినిపించాలని పరశురామ్‌కి అల్లు అరవింద్‌ తేల్చి చెప్పేసాడు. అందుకోసం అతనికి మంచి రైటర్ల బృందాన్ని కూడా అప్పగించాడట. మరి మంచి కథ కోసమే అన్వేషిస్తోన్న మహేష్‌ ఈ చిత్రాన్ని వదులుకోరాదు అనేంత గొప్పగా పరశురామ్‌ దీనిని మలచగలడా లేదా అనేది ఇప్పుడే తేలే విషయం కాదు. అనిల్‌ రావిపూడి సినిమా తర్వాత ఇదే చిత్రాన్ని మహేష్‌ చేసేలా గీతా ఆర్ట్స్‌ ఈ ప్రాజెక్ట్‌ని స్పీడప్‌ చేసిందని ఇన్‌సైడర్స్‌ చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English