వాళ్లిద్దరూ ముచ్చటగా మూడోసారి

వాళ్లిద్దరూ ముచ్చటగా మూడోసారి

రామ్‌, కిషోర్‌ తిరుమల ఇంతవరకు రెండు సినిమాలకి పని చేసారు. నేను శైలజ సూపర్‌హిట్‌ అయితే, ఉన్నది ఒకటే జిందగీ మాత్రం ఫెయిలయింది. అయితే ఆ చిత్రం ఫ్లాపయినా కానీ రామ్‌కి మాత్రం ఇష్టమైన సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడదే దర్శకుడితో రామ్‌ మరో సినిమా చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్‌తో చేస్తోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' బాగా మాస్‌గా వుంటుంది కనుక దాని తర్వాత వచ్చే చిత్రం ఫ్యామిలీస్‌ని ఆకట్టుకునే ఎమోషన్స్‌తో క్లాస్‌గా వుండాలని రామ్‌ భావించాడు. అందుకే 'చిత్రలహరి'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కిషోర్‌ తిరుమలతో ముచ్చటగా మూడవ చిత్రం కోసం డిస్కషన్స్‌ జరుపుతున్నాడు.

ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్‌ బ్యానర్లోనే చేయడానికి రామ్‌ తన పెదనాన్న స్రవంతి రవికిషోర్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా పొందాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ కోసం గెటప్‌ పూర్తిగా మార్చేసిన రామ్‌ ఆ చిత్రం పూర్తయిన తర్వాత కొద్ది రోజులకి తన రెగ్యులర్‌ లవర్‌బాయ్‌ లుక్‌కి వచ్చేస్తాడట. కిషోర్‌ తిరుమలతో చేసే సినిమాలో తన రెగ్యులర్‌ లుక్‌లోనే కనిపిస్తాడట. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంపై పూరి పూర్తి కాన్ఫిడెన్స్‌తో వున్నా కానీ రామ్‌ మాత్రం తన ఎక్స్‌పెక్టేషన్స్‌ని చెక్‌లోనే పెట్టుకున్నాడు. అందుకే తదుపరి చిత్రం కోసం అది విడుదలయ్యే వరకు వేచి చూడకుండా ముందుగానే కిషోర్‌ని లైన్‌లో పెట్టి వుంచాడు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English