బెల్లం'కొండ' కరిగిపోయింది!

బెల్లం'కొండ' కరిగిపోయింది!

స్టార్‌ దర్శకులకి కోట్లాది రూపాయల పారితోషికం ఇచ్చి, స్టార్‌ హీరోయిన్లకి మార్కెట్‌ రేటుకి డబుల్‌ పైకం ఇచ్చి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి హీరోగా గుర్తింపు తెచ్చారు. అయితే అతని మార్కెట్‌ మాత్రం ప్రతి సినిమాతో పడిపోతూ వస్తోంది. పాతిక కోట్లు, ఇరవై కోట్లు నుంచి పదహారు కోట్లకి డ్రాప్‌ అయిన మార్కెట్‌ ఇప్పుడు పన్నెండు కోట్ల దగ్గర ఆగింది. హిట్‌ ఇచ్చిన తేజ దర్శకత్వం వహించినా, కాజల్‌ లాంటి టాప్‌ హీరోయిన్‌ లీడ్‌ రోల్‌ చేసినా కానీ 'సీత'కి పన్నెండు కోట్ల బిజినెస్‌ మాత్రమే జరిగింది.

థియేట్రికల్స్‌ కాకుండా సినిమా హిట్టయితే నాన్‌ థియేట్రికల్స్‌ బాగా వస్తాయని నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటికే తన బిజినెస్‌ కొండ కరిగిపోయి మిడ్‌ రేంజ్‌ నుంచి... కిందకి జారిపోయిన దశలో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఒక్క హిట్టయినా ఇచ్చి తీరాలి. లేదంటే ఇది మరింత క్షీణించి తదుపరి చిత్రం పది కోట్ల బ్రాకెట్‌లోకి పడుతుంది. బెల్లంకొండ ఇటీవల చేస్తోన్న సినిమాలలో సీత స్థాయిలో అంచనాలు రేకెత్తించినది లేదు కనుక హీరోగా నిలదొక్కుకోవడానికి అతనికి ఇదే మంచి అవకాశం. ఈ సినిమా విజయాన్ని బట్టి తదుపరి చిత్రాల బిజినెస్‌ ఆధారపడి వుంటుంది కనుక సీత మీదే ఆధారపడింది బెల్లంకొండ భవితవ్యం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English