కొడుకు మీద ఆశలు వదిలేసుకున్నట్టే

కొడుకు మీద ఆశలు వదిలేసుకున్నట్టే

ఒక టైమ్‌లో వరుస బ్లాక్‌బస్టర్లతో ఇండస్ట్రీని ఏలిన ఎం.ఎస్‌. రాజు ఇప్పుడు తన బ్యానర్‌లో సినిమా చేసేందుకు హీరోలు దొరక్క ఇక్కట్లు పడుతున్నాడు. మహేష్‌, వెంకటేష్‌ లాంటి టాప్‌ స్టార్లతో సినిమాలు తీసిన రాజు ఆ తర్వాత తనయుడిని హీరోగా నిలబెట్టే ప్రయత్నంతో పాటు తన దర్శకత్వ ప్రతిభ చాటుకునే క్రమంలో ఎదురు దెబ్బలు తిన్నాడు. సుమంత్‌ అశ్విన్‌ని స్టార్‌ని చేయాలని చాలా ఆరాట పడిన ఎం.ఎస్‌. రాజు కల ఫలించలేదు. ఎన్ని సినిమాలు చేసినా కానీ ఎదుగు బొదుగు లేకుండా మిగిలిపోయిన తనయుడిపై ఎట్టకేలకు రాజు ఆశలు వదిలేసుకున్నాడు.

మళ్లీ సుమంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ని పునరుద్ధరించే పనిలో పడ్డాడు. ఒకేసారి భారీ సినిమాలు తీయడం కాకుండా మళ్లీ చిన్న సినిమాలతోనే ప్రయాణం మొదలు పెట్టాలని చూస్తున్నాడు. 'ఫలక్‌నుమా దాస్‌' చిత్రంతో యువతని ఆకర్షిస్తోన్న విశ్వక్‌ సేన్‌లో యూత్‌ ఐకాన్‌ అయ్యే లక్షణాలు కనిపించడంతో అతనికి రాజు అడ్వాన్స్‌ ఇచ్చాడు. ఫలక్‌నుమా దాస్‌ విడుదలయితే విశ్వక్‌ సేన్‌ బిజీ అయిపోతాడని అంచనా వేసి అతని డేట్లు సాధించాడు. మరి రాజుగారికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు విశ్వక్‌ సేనుడు ఎంత వరకు దోహదపడతాడో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English