ఇస్మార్ట్ శంకర్.. రామ్ రిగ్రెట్ అవుతున్నాడా?

ఇస్మార్ట్ శంకర్.. రామ్ రిగ్రెట్ అవుతున్నాడా?

పూరి జగన్నాథ్‌తో సినిమా కోసం ఒకప్పుడు స్టార్లు తహతహలాడేవాళ్లు. కానీ ఇప్పుడు మీడియం రేంజి హీరోలు కూడా ఆయనతో సినిమా అంటే ఆలోచిస్తున్నారు. యంగ్ హీరో రామ్ సైతం ఎంతో ఆలోచించి కానీ.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఒప్పుకోలేదు. నాలుగైదు నెలల పాటు ఈ చిత్రాన్ని అతను హోల్డ్‌లో పెట్టాడు. చాన్నాళ్లు చర్చలు నడిచాయి.

స్క్రిప్ట్ వర్క్ కూడా ఎప్పట్లా హడావుడిగా ముగించేయకుండా.. బాగా టైం తీసుకున్నాడు పూరి. ఇలా ఎంతో కసరత్తు చేశాక మొదలైన సినిమాలా కనిపించింది 'ఇస్మార్ట్ శంకర్'. గత అనుభవాల నేపథ్యంలో పూరి.. ఈసారి కచ్చితంగా మార్పు చూపిస్తాడని, రామ్‌ను కొత్తగా ప్రెజెంట్ చేస్తాడని చాలామంది ఆశించారు. కానీ 'ఇస్మార్ట్ శంకర్' టీజర్ చూశాక ఆ ఆశలన్నీ ఆవిరైపోయాయి. పూరి ఏం మారలేదని అర్థమైపోయింది.

పూరి సినిమాల్లో చూసి చూసి విసుగెత్తిపోయిన తలతిక్క, ఎక్స్‌ట్రీమ్ హీరో పాత్రనే రామ్ కూడా చేశాడని టీజర్లో స్పష్టమైంది. రామ్ లుక్‌ను మార్చి, తెలంగాణ స్లాంగ్ పెట్టి ఏదో హడావుడి చేశారు కానీ.. అది అంతగా సెట్టవ్వలేదు. టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, సినిమాకు క్రేజ్ వచ్చేసిందని ఛార్మి అండ్ కో చాలా హడావుడి చేస్తోంది కానీ.. నిజానికి ఈ టీజర్‌ విషయంలో మెజారిటీ ఆడియన్స్ పెదవి విరిచారు. నెగెటివ్ కామెంట్లే చేశారు. రామ్ అభిమానులైతే ఏమాత్రం సంతృప్తిగా లేనట్లు సోషల్ మీడియాలో కామెంట్లను బట్టి అర్థమవుతోంది.

పూరితో అతను సినిమా చేస్తాడని ప్రకటించినపుడే వాళ్ల నుంచి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు టీజర్ చూశాక ఉన్న కాస్తా ఆశలు కూడా ఆవిరయ్యాయి. అభిమానుల ఫీడ్ బ్యాక్‌ చూశాక రామ్ సైతం 'ఇస్మార్ట్ శంకర్' విషయంలో కొంచెం రిగ్రెట్ అవుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రైలర్లో కథ గురించి చెబుతారు కాబట్టి అందులో ఏమైనా కొత్తదనం ఉండి, స్టన్నింగ్ సీన్లు, షాట్లు పడితే తప్ప 'ఇస్మార్ట్ శంకర్'పై జనాల ఫీలింగ్ మారే సూచనలు కనిపించడం లేదు. చూద్దాం ట్రైలర్ ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English