'సీత'కు పరుచూరి డాక్టర్ల వైద్యం

'సీత'కు పరుచూరి డాక్టర్ల వైద్యం

రచయితలుగా 350కి పైగా సినిమాల అనుభవం పరుచూరి సోదరులది. తెలుగులోనే కాదు.. భారతీయ సినీ చరిత్రలోనే ఇంత అనుభవం ఉన్న రచయితలు చాలా చాలా అరుదు. మెగాస్టార్ చిరంజీవి సహా చాలామంది దిగ్గజాలు పరుచూరి సోదరుల్ని ఎంతగానో నమ్ముతారు. చిరు తనయుడు రామ్ చరణ్ వాళ్లిద్దరినీ 'స్క్రిప్ట్ డాక్టర్స్' అంటుంటాడు.

మెగా ఫ్యామిలీ హీరోలే కాదు.. ఇండస్ట్రీలో ఇంకా చాలామంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. తమ సినిమాల్ని పరుచూరి బ్రదర్స్‌కు చూపించి సలహాలు, సూచనలు తీసుకుంటుంటారు. వాళ్లు చెప్పినట్లు సినిమాను మార్చడం కూడా చేస్తుంటారు. తాజాగా దర్శకుడు తేజ సైతం 'సీత' సినిమా విషయంలో వీరినే నమ్ముకున్నాడట. సినిమా అంతా తీసేశాక ఆయన పరుచూరి వారిని పిలిచి.. సినిమా చూడమని చెప్పాడట.

మామూలుగా సినిమా విడుదలయ్యాక జనాలు చూసి తప్పులు ఎంచి ఏకేస్తుంటారని.. కానీ తాను మాత్రం విడుదలకు ముందే పరుచూరి సోదరుల్ని పిలిచి సినిమా చూసి తనను ఏకేయమని చెప్పానని తేజ చెప్పాడు. తాను కోరినట్లే వాళ్లిద్దరూ సినిమా చూశారని.. తప్పులు చెప్పారని.. మార్పులు సూచించారని.. ఆ మేరకు మళ్లీ రీషూట్లు అవీ చేసి సినిమాను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దానని తేజ చెప్పాడు. ఇంతకుముందు రీషూట్ అంటేనే నెగెటివ్ వర్డ్‌ లాగా వినిపించేది. కానీ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా విషయంలో ఔట్ పుట్ బాలేకుంటే అక్కినేని నాగార్జున.. ఇలాగే స్క్రిప్టు కొంచెం మార్చి రీషూట్ చేయించాడు.

ఆ విషయాన్ని అందరికీ ఓపెన్‌గా చెప్పాడు. ఇక అప్పట్నుంచి అందరూ ఇదే ట్రెండు ఫాలో అవుతున్నారు. ఇండస్ట్రీలో చెయ్యి తిరిగిన వాళ్లకు సినిమా చూపించడం.. వాళ్లు చెప్పిన మార్పులు చేర్పుల్ని క్యారీ చేయడం.. అవసరమైతే రీషూట్లు చేసి సినిమాను మరింతగ మెరుగ్గా తీర్చిదిద్దడం చేస్తున్నారు. తేజ కూడా అదే పని చేసినట్లు చెప్పుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English