కాజల్, తమన్నాల అందాల్నే నమ్ముకున్నారు

కాజల్, తమన్నాల అందాల్నే నమ్ముకున్నారు

బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ మసాలా సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటిదాకా హిట్టు కొట్టలేదు కానీ.. అతడి సినిమాలకు ఓపెనింగ్స్ అయితే బాగానే వస్తుంటాయి. ఇక దర్శకుడు తేజ కూడా తనకంటూ ఒక ఇమేజ్, ఫాలోయింగ్ ఉన్నవాడే. కానీ 'సీత' సినిమాకు సంబంధించి వీళ్లిద్దరూ ప్రేక్షకుల్ని ఏ మేరకు థియేటర్లకు రప్పిస్తారన్నది సందేహంగానే ఉంది. ఈ సినిమా భారమంతా కాజల్ అగగర్వాల్ మీదే మోపారు. సినిమా ప్రోమోలన్నింట్లోనూ ఆమే హైలైట్ అయింది.

మేకింగ్ స్టిల్స్ నుంచి అన్ని చోట్లా చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది కాజల్. దీని టైటిల్ చూస్తేనే కాజల్ చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. కాజల్‌కు వ్యక్తిగతంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను చూడ్డానికే సినిమాకు వచ్చే అభిమానులు పెద్ద ఎత్తునే ఉంటారు. 'సీత'కు సంబంధించి ఈ అవకాశం ఇంకా ఎక్కువే ఉండే అవకాశముంది. మొత్తంగా చెప్పాలంటే 'సీత' టీం అంతా కాజల్ ‌గ్లామర్ మీదే ఆశలు పెట్టుకుంది. 'సీత' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

'సీత' వచ్చిన వారం తర్వాత విడుదలవుతున్న 'అభినేత్రి-2' కూడా దీనికి భిన్నమేమీ కాదు. ఆ చిత్రం కూడా హీరోయిన్ తమన్నా గ్లామర్ మీదే ప్రధానంగా ఆధారపడినట్లుగా కనిపిస్తోంది. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ అనేసరికి దీనికి ఆశించినంత క్రేజ్ రాలేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ జనాలు పట్టించుకోలేదు. దీంతో కుర్రాళ్ల మీదికి తమన్నాను ప్రయోగించారు. 'రెడీ రెడీ' అంటూ సాగే హాట్ సాంగ్ ప్రోమో వదిలారు. దానికి మంచి స్పందన వచ్చింది. రిలీజ్ మరింత దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ఏకంగా 'రెడీ రెడీ' ఫుల్ సాంగ్ వదిలేస్తున్నారు.

ఈ పాట తాలూకు పోస్టర్లో తమన్నా అందాలకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. తమన్నా అందాల్ని ఇలా చూసి పెద్దతెరపై మరింతగా ఆస్వాదించడానికి ప్రేక్షకులు వస్తారన్నది వాళ్ల నమ్మకం కావచ్చు. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభుదేవాకు, దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌లకు మంచి గుర్తింపే ఉన్నప్పటికీ.. 'అభినేత్రి-2' భారాన్ని తమన్నా గ్లామర్ మీదే మోపినట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి హీరోయిన్ల అందాలే ఆకర్షణగా వస్తున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English