ఎన్టీఆర్‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చిన క‌మ‌ల్

ఎన్టీఆర్‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చిన క‌మ‌ల్

జూనియ‌ర్ ఎన్టీఆర్ చాలా ఏళ్ల కింద‌ట ఓ సినీ వేడుక‌లో మాట్లాడుతూ అభిమానులు త‌న‌ను 'జూనియ‌ర్ ఎన్టీఆర్' పిల‌వొద్ద‌ని కోరాడు. ఎన్టీఆర్ అనే పిల‌వ‌మ‌న్నాడు. దీని వెనుక అత‌డి ఉద్దేశం ఏంటో ఏమో మ‌రి. కానీ త‌ర్వాత ఆ విష‌యం అత‌ను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు అత‌డిని ఎన్టీఆర్ అని, జూనియ‌ర్ ఎన్టీఆర్ అని రెండు ర‌కాలుగా పిలుస్తున్నారు. క్ర‌మంగా జూనియ‌ర్ అనే పిలుపు ప‌క్క‌కు వెళ్లిపోతోంది.

ఇదిలా ఉంటే.. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు తార‌క్ పేరు ముందున్న జూనియ‌ర్ అనే మాట‌ను తీసేశాడు. అత‌డిని సీనియ‌ర్‌ను చేసేశాడు. సోమ‌వారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా క‌మ‌ల్ ఆస‌క్తిక‌ర రీతిలో అత‌డికి శుభాకాంక్ష‌లు చెప్పాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. కానీ నువ్విప్పుడు సీనియర్.. ఎంజాయ్ అని క‌మ‌ల్ ట్వీట్ చేయ‌డం విశేషం.

ఎన్టీఆర్ పెద్ద‌వాడు అయ్యాడ‌ని.. అత‌ను ఇక జూనియ‌ర్ కాద‌ని చెప్ప‌డం క‌మ‌ల్ ఉద్దేశ‌మే లేక‌.. పెద్ద ఎన్టీఆర్ స్థాయికి అత‌ను ఎదిగిపోయాడ‌ని క‌మ‌ల్ అంటున్నాడా అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఏదేమైన‌ప్ప‌టికీ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన పెద్ద పెద్ద వాళ్ల పుట్టిన రోజుల‌కు కూడా స్పందించ‌ని క‌మ‌ల్.. తార‌క్‌కు ఇలా శుభాకాంక్ష‌లు చెప్ప‌డం అత‌డి అభిమానుల‌కు మ‌హ‌దానందాన్ని క‌లిగించింది.

గ‌త ఏడాది త‌న తండ్రి మ‌ర‌ణించిన నేప‌థ్యంలో ఆయ‌న లేకుండా జ‌రుగుతున్న పుట్టిన రోజుకు సంబ‌రాలేమీ చేసుకోకూడ‌ద‌ని తార‌క్ నిర్ణ‌యించుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ సామాజిక మాధ్య‌మాల్లో, బ‌య‌ట అభిమానులు పెద్ద ఎత్తున తార‌క్ పుట్టిన రోజు వేడుక‌ల్ని జ‌రిపారు. తార‌క్‌కు వివిధ రంగాల ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు చెప్పారు. అత‌డి న‌ట కౌశ‌లాన్ని కొనియాడారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English