తమన్నా రచ్చని మించి రెచ్చిపోయిందిగా!

 తమన్నా రచ్చని మించి రెచ్చిపోయిందిగా!

తమన్నా భాటియా అందాల ఆరబోత అనగానే ముందుగా గుర్తొచ్చేది 'రచ్చ'. ఆ చిత్రంలో రచ్చ చేసినట్టుగా తమన్నా అంతకు ముందు, ఆ తరువాత ఎక్కడా చేయలేదు. కానీ అభినేత్రి 2లో రచ్చని మించిన రచ్చ చేసిందనేది తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ తెలియజేస్తోంది. అభినేత్రి చిత్రం ఆర్థిక విజయాన్ని అందుకోకపోయినా కానీ మంచి హారర్‌ చిత్రంగా ప్రశంసలు అందుకుంది. అందుకే ఆ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించారు. కేవలం హారర్‌ ఎలిమెంట్స్‌ మాత్రమే పెట్టేస్తే సరిపోదని ఈసారి తమన్నా గ్లామర్‌ని కూడా ఫుల్‌గా వాడేసుకున్నారు.

ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ ఎలా కనిపించబోతుందనేది ఈ ఫోటో చూసి అర్థం చేసుకున్న తమన్నా ఫాన్స్‌ ఆల్రెడీ జాగారాలు స్టార్ట్‌ చేసేసారు. ఇంతకాలం తమన్నాని మరచిపోయి పక్క చూపులు చూసిన పాత అభిమానులు సయితం ఇప్పుడు తిరిగి తమన్నా నామ జపం షురూ చేసారు. మరి ఈ అందాల 'ఆరబోత' కేవలం ఒక్క పాట చందమో లేక సినిమాలో కావాల్సినంత కనువిందు వుందో తెలియాలంటే ఒక పది రోజులు వేచి చూడక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English