పూరీ హీరోయిన్‌కి బ్రేక్‌ ఇస్తోన్న బన్నీ

పూరీ హీరోయిన్‌కి బ్రేక్‌ ఇస్తోన్న బన్నీ

పూరి జగన్నాథ్‌ సినిమాలు ఫెయిలవుతూ వుండొచ్చు కానీ అతను ఇంట్రడ్యూస్‌ చేసిన హీరోయిన్లు మాత్రం హిట్‌ అవుతూనే వుంటారు. లోఫర్‌తో తెరపై తొలిసారి మెరిసిన దిషా పటాని ఇప్పుడు బాలీవుడ్‌లో పెను సంచలనం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాస్టెస్ట్‌ రైజింగ్‌ ఇండియన్‌ స్టార్‌. పూరి నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రంతో పరిచయం అవుతోన్న కేతిక శర్మ ఇంకా తొలి సినిమా విడుదల కాకుండానే జాక్‌పాట్‌ కొట్టేసింది.

పూరి తనయుడు ఆకాష్‌ పూరి నటిస్తోన్న రెండవ సినిమాలో కథానాయిక అయిన కేతికకి అల్లు అర్జున్‌ నుంచి కబురొచ్చింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న అల్లు అర్జున్‌ పంతొమ్మిదవ చిత్రంలో కేతిక రెండవ కథానాయికగా ఎంపికయింది. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా పూజ హెగ్డే నటిస్తోండగా, కేతిక పాత్రకి కూడా తగిన ప్రాధాన్యత వుండనుంది.

ఈ పాత్ర కోసం హాట్‌ గాళ్‌ కోసం వెతుకుతోన్న త్రివిక్రమ్‌కి కేతిక తారస పడింది. ఆమెని పిలిపించిన ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఈ సినిమాలో రోల్‌ కన్‌ఫర్మ్‌ అయిపోయింది. ఇక ఈ చిత్రం హిట్టయితే కేతిక స్టార్‌డమ్‌కి వేదికగా టాలీవుడ్‌ నిలిచిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English