మహర్షితో ఇద్దరికీ చెరో రెండు కోట్లు పోతాయ్‌!

మహర్షితో ఇద్దరికీ చెరో రెండు కోట్లు పోతాయ్‌!

మహర్షి బ్లాక్‌బస్టర్‌ అని, తన కెరియర్లోనే అత్యుత్తమ చిత్రమని మహేష్‌ ఇస్తోన్న స్టేట్‌మెంట్స్‌ అన్నీ సినిమాకి హైప్‌ పెంచడానికే అని అర్థం చేసుకోవాలి. ఏ హీరో అయినా తన తాజా చిత్రం బాగా ఆడాలనే అనుకుంటాడు. అందుకే మిగిలిన అన్ని సినిమాలకంటే ఇదే బెస్ట్‌ అని చెబుతుంటాడు. లేదంటే మహర్షిలాంటి యావరేజ్‌ చిత్రాన్ని పోకిరి, అతడు, శ్రీమంతుడు కంటే ఉత్తమమని మహేష్‌ ఎందుకంటాడు? పోనీ మహేష్‌ చెబుతున్నట్టుగా ఇది బ్లాక్‌బస్టరా అంటే ఖచ్చితంగా కాదు. మహేష్‌కి కంచుకోటగా చెప్పే ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది.

ఈ చిత్రంపై ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ తక్కువలో తక్కువ రెండు కోట్లు నష్టపోనున్నాడు. అలాగే సీడెడ్‌ డిస్ట్రిబ్యూటర్‌కి కూడా లాస్‌ రెండు కోట్లపైనే వుంటుందని అంటున్నారు. దిల్‌ రాజు స్వయంగా విడుదల చేసుకున్న నైజాం, ఉత్తరాంధ్రలో తప్ప ఇంకెక్కడా ఇది బ్రేక్‌ ఈవెన్‌ కూడా కాలేదు. దిల్‌ రాజు ప్రకటిస్తోన్న నంబర్లపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిల్‌ రాజు రిలీజ్‌ చేసిన ఏరియాలు అటుంచితే మహర్షికి చాలా ఏరియాల్లో స్వల్ప నష్టాలయితే పక్కా అనిపిస్తోంది. సీడెడ్‌, ఓవర్సీస్‌లో మాత్రం నష్టం కాస్త తీవ్రంగా వుంది. ప్రస్తుతానికి మహేష్‌ ఏమి మాట్లాడుతున్నా ఒక అయిదారేళ్ల తర్వాత తన ఉత్తమ చిత్రాల జాబితా చెప్పినపుడు ఈ చిత్రం ప్రస్తావన అయితే ఖచ్చితంగా తీసుకురాడనే అనుకోవచ్చు. ఇదంతా మొమెంటరీ హైప్‌ కోసం చేస్తున్నదే అని అర్థం చేసుకోవాలంతే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English