బ‌న్నీ రేంజికి స‌రిపోతుందా?

బ‌న్నీ రేంజికి స‌రిపోతుందా?

'నా పేరు సూర్య‌' త‌ర్వాత త‌న కొత్త సినిమాను ఖ‌రారు చేయ‌డానికి చాలా స‌మ‌య‌మే తీసుకున్నాడు అల్లు అర్జున్.  త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఖ‌రార‌య్యాక కూడా ఇది ప‌ట్టాలెక్క‌డానికి చాలా టైం ప‌ట్టేసింది. ఎట్ట‌కేల‌కు ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ వెకేష‌న్లో ఉన్న బ‌న్నీ.. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాడు. విరామం లేకుండా ప‌ని చేసి సినిమాను వేగంగా పూర్తి చేయాల‌ని టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో ఓ క‌థానాయిక‌గా పూజా హెగ్డే ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. రెండో క‌థానాయిక‌గా ప‌లు పేర్లు వినిపించాయి. చివ‌ర‌గా కేథ‌రిన్ థ్రెసా పేరు ఖ‌రారైన‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం కేథ‌రిన్‌కు ఈ చిత్రంలో ఛాన్స్ లేద‌ట‌. ఆమె స్థానంలో ఓ కొత్త‌మ్మాయిని ఖ‌రారు చేశాడ‌ట త్రివిక్ర‌మ్.

ఆ కొత్త‌మ్మాయి పేరు.. కేతిక శ‌ర్మ‌. ఈ ముంబ‌యి అమ్మాయి ఇప్ప‌టికే టాలీవుడ్లోకి అడుగు పెట్టేసింది. పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా న‌టిస్తున్న *రొమాంటిక్* చిత్రంలో ఈ అమ్మాయే క‌థానాయిక‌. మోడలింగ్ నుంచి ఆమె సినిమాల్లోకి వ‌చ్చింది. ఐతే ఆకాశ్ లాంటి వ‌ర్ధ‌మాన క‌థానాయ‌కుడి ప‌క్క‌న చిన్న సినిమాలో న‌టిస్తున్న కొత్త అమ్మాయి బ‌న్నీ ప‌క్కన క‌థానాయిక అంటే బాగుంటుందా అన్న‌ది డౌటు. పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ని ఓ క‌థానాయిక‌గా పెట్టుకుని.. ఎవ‌రికీ ప‌రిచ‌యం లేని కొత్త అమ్మాయిని రెండో నాయిక‌గా ఎంచుకోవ‌డ‌మూ ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. కాక‌పోతే త్రివిక్ర‌మ్ సినిమాల్లో రెండో హీరోయిన్ పాత్ర నామ‌మాత్రంగా ఉంటుంది కాబ‌ట్టి లైట్ తీసుకోవ‌చ్చేమో. ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English