ఎక్స్‌ లవర్‌పై జోకేసి బుక్‌ అయిన హీరో

ఎక్స్‌ లవర్‌పై జోకేసి బుక్‌ అయిన హీరో

అభిషేక్‌బచ్చన్‌తో పెళ్లికి ముందు ఐశ్యర్యారాయ్‌ కొంతకాలం వివేక్‌ ఒబెరాయ్‌, సల్మాన్‌ ఖాన్‌తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. తర్వాత అభిషేక్‌ని ఎంచుకుని అతనితో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ లీడ్‌ చేస్తోన్న ఐశ్వర్యపై వివేక్‌ ఒక కుళ్లు జోక్‌ వేసాడు. ఎగ్జిట్‌ పోల్స్‌ నేపథ్యంలో ఐశ్వర్య సల్మాన్‌తో, తనతో ఇప్పుడు అభిషేక్‌తో వుంటోన్నది ప్రస్తావిస్తూ చేసిన ఒక మీమ్‌ని తన ట్విట్టర్‌లో షేర్‌ చేసాడు. పెళ్లయి భర్త, పాపలతో హ్యాపీగా వున్న స్త్రీని రాజకీయ కామెంట్‌ కోసం లేదా చిన్న పొలిటికల్‌ జోక్‌ కోసం టార్గెట్‌ చేయడం ఎవరికీ నచ్చలేదు.

ఆఖరుకి వివేక్‌ శ్రేయోభిలాషులు కూడా ఇది మంచిది కాదంటూ ట్వీట్‌ డిలీట్‌ చేయమని సలహా ఇచ్చారు. కొందరయితే అకౌంట్‌ హ్యాక్‌ అయిందనే సాకు చెప్పి తప్పించుకోమని చెప్పారు. మరికొందరు సల్మాన్‌తో మరోసారి తన్నులు తినే టైమ్‌ వచ్చిందన్నారు. ఇంకొందరు ఫుట్‌పాత్‌లపై నడవకుండా చూసుకోమని, సల్మాన్‌ కారు గుద్దేస్తుందని హెచ్చరించారు. సోనమ్‌ కపూర్‌ లాంటి ప్రముఖులు డిస్‌గస్టింగ్‌ అంటూ తిట్టిపోసారు. మోడీ జీవిత కథతో తీసిన సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషించినందు వల్ల వచ్చిన ఉత్సాహమేమో వివేక్‌ గీత దాటాడు. ఇంకా దీనికి సారీ చెప్పని వివేక్‌ జనాల నుంచి వస్తోన్న వ్యతిరేకత చూసి అయినా తన జోక్‌ ఎంత నీచంగా వుందో తెలుసుకుంటాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English