దేవిశ్రీప్రసాద్‌ ఓ మోనార్క్‌!

దేవిశ్రీప్రసాద్‌ ఓ మోనార్క్‌!

పెద్ద సినిమాలకి సంగీతం చేసేప్పుడు కాస్త తగ్గి వుండే దేవిశ్రీప్రసాద్‌ ఏదైనా స్టార్‌ హీరో లేని సినిమాకి మ్యూజిక్‌ చేయాల్సి వస్తే మాత్రం దారుణంగా డామినేట్‌ చేస్తుంటాడట. దర్శకుడికి డైరెక్షన్‌ నేర్పిస్తూ అతను అడిగిన పాట కాకుండా తనకి నచ్చిన పాట ఇచ్చి దానికి తగ్గట్టు సీన్‌ మార్చుకోమంటాడట. ఫలానా పాట షూటింగ్‌ చేస్తున్నారని తెలిసినా కానీ పూర్తి పాట రెడీ చేసి పంపించడట. కానీ దేవి పేరు వుంటే సినిమాకి ప్లస్‌ అవుతుందని చిన్న సినిమాలకి అతడి వెంట పడి మరీ డేట్లు సంపాదిస్తూ వుంటారు. వాల్మీకి చిత్రానికి దేవి మ్యూజిక్‌ చేస్తున్నాడని హరీష్‌ శంకర్‌ చాలా ఆనంద పడ్డాడు.

గబ్బర్‌సింగ్‌, డీజే చిత్రాలకి అదిరిపోయే బాణీలు అందించిన దేవితో హ్యాట్రిక్‌ మ్యూజికల్‌ హిట్‌ ఖాయమని అనుకున్నాడు. కానీ వాల్మీకిలో ఒక రీమిక్స్‌ సాంగ్‌కి మ్యూజిక్‌ ఇవ్వలేనంటూ దేవి మొత్తానికి ఆ చిత్రమే వదిలేసుకున్నాడు. సదరు రీమిక్స్‌ తన సినిమాకి చాలా అవసరమని ఎంత కన్విన్స్‌ చేసినా కానీ దేవి వినలేదు. కనీసం ఆ పాట వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌తో చేయించుకుంటామని చెప్పినా కానీ తన సినిమాలో వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌ పేరేమిటి అంటూ టోటల్‌గా సినిమానే వదిలేసాడు. భారీ చిత్రాలకి ఇదే సిట్యుయేషన్‌ వస్తే దేవి రియాక్షన్‌ ఎలా వుంటుందో కానీ దేవిలో ఈ మోనార్కిజమ్‌ నచ్చకే అతనితో త్రివిక్రమ్‌ పని చేయడం మానేసాడని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటూ వుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English