సీతకి ఇక్కడయితే సీన్‌ లేదు

సీతకి ఇక్కడయితే సీన్‌ లేదు

'సీత' చిత్రానికి ఎంత క్రేజ్‌ వుందనేది రేపు ఓపెనింగ్స్‌ చూసాకే తెలుస్తుంది. అయితే ఓపెనింగ్స్‌కి టీజర్‌లా పని చేసే మల్టీప్లెక్స్‌ బుకింగ్స్‌లో అయితే 'సీత'కి అంత సీన్‌ లేదని అనిపిస్తోంది. సాధారణంగా బాగా ఎదురు చూస్తోన్న సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టగానే బుక్‌ అయిపోతుంటాయి. హండ్రెడ్‌ పర్సంట్‌ కాకపోయినా స్పీడ్‌ బుకింగ్స్‌ ట్రెండ్‌ అయితే తెలిసిపోతూనే వుంటుంది. కానీ సీత బుకింగ్స్‌ ముఖ్యమయిన మల్టీప్లెక్స్‌లలో ఓపెన్‌ అయినా కానీ అంతగా స్పందన లేదనే ట్రెండ్‌ చెబుతోంది.

ఈ చిత్రం ట్రెయిలర్స్‌ బాగున్నా, కాజల్‌ వల్ల యూత్‌ ఆదరణ వుంటుందని భావించినా కానీ దీనికి బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆకర్షణ కాలేకపోతున్నాడు. ఏ సినిమాకి అయినా మేజర్‌ ఎట్రాక్షన్‌ హీరోనే కనుక బెల్లంకొండ శ్రీనివాస్‌కి క్లాస్‌లో, యూత్‌లో ఫాలోయింగ్‌ లేకపోవడం సీతపై ప్రభావం చూపిస్తోంది. బెల్లంకొండకి మాస్‌ థియేటర్లలో స్పందన బాగానే వస్తుంటుంది. కానీ వరుస ఫ్లాప్‌ల వల్ల అది ఎంత వరకు డ్యామేజ్‌ అయిందనేది చూడాలి. విడుదలకి ఇంకా నాలుగు రోజుల సమయం వుంది కనుక ఈలోగా సీత వైపు ప్రేక్షకుల దృష్టి పడేలా ఏదైనా చేస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English