అతడిని తగ్గించడానికి ఒప్పుకోని చిరంజీవి!

అతడిని తగ్గించడానికి ఒప్పుకోని చిరంజీవి!

సైరా చిత్రానికి చిరంజీవి కంటే ఆకర్షణ ఏముంటుంది? తెలుగు మార్కెట్‌ వరకు అది నిజమే. కానీ ఇతర రాష్ట్రాల్లో చిరంజీవి ఫ్యాక్టర్‌ మీద ఈ చిత్రం నడవదు. రెండు వందల కోట్లకి పైగా బడ్జెట్‌ పెట్టిన సినిమాకి తెలుగు రాష్ట్రాలలో మాత్రమే వసూళ్లు వస్తే సరిపోదు. ముఖ్యంగా తమిళనాట ఈ చిత్రం బాహుబలి స్థాయిలో ఆడాలని ఆశిస్తున్నారు. కేవలం చిరంజీవిపై తమిళంలో అంత సంచలనం కష్టమనుకోవడం వలనే హీరోయిన్‌గా నయనతారని, కీలక పాత్రలో విజయ్‌ సేతుపతిని తీసుకున్నారు.

ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందట. అతనికి అంత డామినేషన్‌ వుండకూడదని కాస్త టోన్‌ డౌన్‌ చేయాలనే ఆలోచన రైటర్స్‌కి వచ్చిందట. అదే మాట చిరంజీవితో అంటే అందుకు ఆయన అసలు అంగీకరించలేదట. ఈ చిత్రానికి విజయ్‌ సేతుపతి కూడా మెయిన్‌ ఎట్రాక్షన్‌ అవుతాడని, ముఖ్యంగా తమిళంలో అతని వల్ల చాలా బెనిఫిట్‌ వుంటుందని, అతని నటన అంటే తనకి చాలా ఇష్టమని, అతడి పాత్ర ఏమాత్రం కుదించవద్దని, ఎడిటింగ్‌లో కూడా అతని సీన్లపై వేటు పడకుండా చూసుకోవాలని చిరంజీవి స్వయంగా చెప్పడంతో ఈ చిత్రంలో సేతుపతి పాత్ర అద్భుతంగా వచ్చిందని, ఈ చిత్రానికి మేజర్‌ హైలైట్‌ అవుతుందని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English