నాన్‌-బాహుబలి కూడా ప్రభాస్‌దేనా?

నాన్‌-బాహుబలి కూడా ప్రభాస్‌దేనా?

బాహుబలి రికార్డుల క్రెడిట్‌ ప్రభాస్‌కంటే రాజమౌళికి, ఆ సినిమా స్కేల్‌కి ఇచ్చేస్తుంటారు సినీ అభిమానులు. అందుకే 'నాన్‌-బాహుబలి' రికార్డులని కూడా సెలబ్రేట్‌ చేసుకుంటూ వుంటారు. రికార్డు సాధించిన సినిమాకి హీరోదే పెద్ద రోల్‌ అయితే బాహుబలి రికార్డులకి ప్రభాస్‌కి ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వాల్సిందే కానీ ఇంకా పెద్ద ఫాన్‌ బేస్‌ వున్న ఇతర హీరోల అభిమానులు అందుకు అంగీకరించరు. మరి రాజమౌళి లేకుండా ప్రభాస్‌ ఒక్కడే వచ్చి నాన్‌-బాహుబలి రికార్డు కొడితే అప్పుడు కూడా ప్రభాస్‌ టాప్‌ అని ఒప్పుకోరా?

సాహో చిత్రం కనుక నిజంగా అంచనాలని అందుకున్నట్టయితే 'నాన్‌-బాహుబలి' రికార్డులు కొట్టడం మంచినీళ్ల ప్రాయమేనని కాస్త ఆలోచన వున్న ఏ సినీ అభిమాని అయినా అంగీకరిస్తాడు. బాహుబలి తర్వాత రెండేళ్ల విరామం అనంతరం వస్తోన్న ప్రభాస్‌ సినిమా కనుక సాహోపై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. ఈ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్‌ అయితే ఖాయం. ఇక సినిమా ఏమాత్రం బాగుందనే టాక్‌ వచ్చినా కానీ వారం రోజుల్లో అన్ని రికార్డులు భూస్థాపితం అవుతాయి. నిజంగా ప్రభాస్‌కి కనుక బాహుబలి ఇమేజ్‌ కలిసి వచ్చి సాహోకి కూడా నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ యాడ్‌ అయితే కనుక ఇప్పట్లో ప్రభాస్‌ని అందుకోవడం ఏ హీరోకి అయినా గగనమే అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English