కాజల్ టీజింగ్ వెనుక కథనమేంటో?

కాజల్ టీజింగ్ వెనుక కథనమేంటో?

కాజల్ అగర్వాల్. ఈ 34 ఏళ్ళ సుందరి 2004లో సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగులోకి 2007లో వచ్చి లక్ష్మీ కల్యాణంతో ఎంట్రీ ఇచ్చింది. పన్నెండేళ్ళ నుండి స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడు సడన్ గా అమ్మడు తన ఇనస్టాగ్రామ్ లో రోజూ హాట్ హాట్ ఫోటోలతో తెగ టీజింగ్ చేస్తోంది. ఇంతకీ ఈ 34 ఏళ్ళ సుందరి ఇటువంటి పోస్టులు ఎందుకు పెడుతున్నట్లు?

నిజానికి ఈ విషయం గురించి అందరూ చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే.. ఇప్పుడు తనకు వయసు మీద పడుతోంది కాబట్టి, ఖచ్చితంగా ఫిలిం మేకర్లు ఎట్రాక్ట్ చేయాలంటే గ్లామరసం దట్టించాల్సిందే. అందుకే కాజల్ ఇలా సోకులు దారపోస్తోంది అంటున్నారు. అయితే ఇదే విషయం గురించి కాజల్ ను కాస్త ఇన్ డైరక్టుగా ప్రశ్నిస్తే .. కుర్ర హీరోలతో సినిమాలు చేస్తే ఇండస్ర్టీలో లాంజివిటీ (ఎక్కువ కాలం కొనసాడం) ఉంటుందని సెలవిచ్చింది. అందుకే చిన్నా చితకా హీరోలతో సినిమాలు చేస్తోంది. మరి అలాంటి హీరోల సరసన కాజల్ ను క్యాస్టింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఆమె అందాల విందు వడ్డించాల్సిందే అంటున్నారు సినిమా లవ్వర్స్. అందుకే కుర్ర హీరోయన్లకు పోటీగా ఇప్పుడు ఇలా ఇనస్టాగ్రామ్ లో మెరుపులు మెరిపిస్తోంది.

కాజల్ నటించిన 'సీత' సినిమా ఈ శుక్రవారం రిలీజవుతోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English