ఫారిన్ పోరీకి ప్యాకప్ జెప్పేసిండట

ఫారిన్ పోరీకి ప్యాకప్ జెప్పేసిండట

సడన్ గా పెద్ద హీరో అయిపోయిన ఈ సడన్ స్టార్.. ఇటు ఎఫైర్ల విషయంలో కూడా పెద్ద స్టారే అంటున్నారు అతనికి దగ్గరగే ఉండే సినీజనాలు. ప్రస్తుతం అతను రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ, ఒక ప్రక్కన లవ్ లైఫ్‌ ను మాత్రం భలేగా నడిపిస్తున్నాడట. ముఖ్యంగా అతగాడి బ్రేకప్పులూ కొత్త లింకప్పులూ మామూలుగా లేవులే.

నిజానికి తనకు బ్రేక్ ఇచ్చిన ఒక సినిమాలో ఒక ఫారిన్ పిల్ల చిన్న సీన్లో నటిస్తే, ఆమెతో మనోడు రొమాన్స్ స్టార్ట్ చేశాడు. ఆ మధ్యన ఆమె కోసం ఆమె సొంత దేశం కూడా వెళ్ళొచ్చాడు. అయితే ఈ ఇద్దరూ దాదాపు పెళ్ళి చేసుకుంటారు అన్న తరుణంలో, ఇక్కడ లోకల్ గా మరో హీరోయిన్ తో మనోడు కొత్త యవ్వారం ఒకటి మొదలుపెట్టాశాడట. ఈ లోకల్ హీరోయిన్ కూడా ముందులో ఇతగాడితో ఏ లింకప్ లేదూ అని ప్రవర్తించింది కాని, ఇప్పుడు మాత్రం హైదరాబాదులో ఉన్న ఒక 7 స్టార్ హోటల్లో రోజూ వీరి లేట్ నైట్ డిస్కషన్లు చూస్తుంటే చూపరులకు అలా అనిపంచట్లేదు.

అయితే తాజా ట్విస్ట్ ఏంటంటే.. మన హీరో ఆ పారిన్ పోరీకి ప్యాకప్ అని జెప్పేసిండట. అదేనండి వాట్సాప్ లో బ్రేకప్ అని చెప్పాడట. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ మెయిన్టయిన్ చేయడం కష్టం అని చెప్పి ఆమెను పక్కనెట్టేశాడట. కాని నిజం ఏంటంటే.. ఇక్కడ లోకల్ హీరోయిన్ తో క్లోజ్ అవడం వలన ఆ రిలేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు. మరి ఈ రిలేషన్ ఎన్నాళ్ళు సాగుతుందో చూడాలి. అసలే మనోడు ఎఫైర్ల విషయంలో కామాలే కాని ఫుల్ స్టాపులు ఉండవ్ అనే టైప్!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English