నానిలా మేం చేయలేం బాబోయ్

నానిలా మేం చేయలేం బాబోయ్

ఈ మధ్యనే ఆగస్టు 30న తన 'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజవ్వబోతోందని న్యాచురల్ స్టార్ నాని ప్రకటించేశాడు. అయితే ఇంకా మూడ్నెళ్ళు టైమ్ ఉన్నప్పటికీ అప్పుడే తన సినిమా రిలీజ్ డేటు ఎందుకు ప్రకటించాడో కాని.. నాని అలా చేయడంతో ఇప్పుడు ఇతర హీరోలకు ఒక పెద్ద సవాల్ వచ్చిపడింది. నాని వంటి రేంజులోనే ఉన్న చాలామంది హీరోలు.. సంవత్సరానికి కేవలం ఒక్క సినిమాతోనే వస్తుంటే.. నాని మాత్రం 2-3 సినిమాలు చేసేస్తున్నాడు. మరి మన కుర్ర హీరోల బ్యాచ్ ఈ విషయం గురించి అసలు ఏమనుకుంటోంది?

మొన్న శనివారం రాత్రి ఒక పార్టీలో కలసిన కొంతమంది హీరోల బ్యాచ్.. ఇదే విషయం చర్చించుకున్నారట. అసలు నాని లైఫ్‌ మాకొద్దు బాబోయ్, మేం సంవత్సరానికి ఒక్క సినిమాయే చేస్తాం అని చెప్పారట కొందరు బాబులు. ఇంతకీ నాని లైఫ్‌ అంటే ఏంటంటే.. ఒక సినిమా పూర్తయినా కూడా నాని అస్సలు బ్రేక్ తీసుకోడు. మజిలి హిట్టు కొట్టగానే నాగ చైతన్య 20 రోజుల పాటు యురోప్ ట్రిప్పుకు వెళ్ళాడు. ఇప్పుడు మహేష్‌ లండన్ వెళ్తున్నాడు. అలాగే రామ్ చరణ్‌ అండ్ ఎన్టీఆర్ కూడా ఫారిన్ ట్రిప్పులు తెగ వేస్తుంటారు. నాని తరహాలో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయాలంటే.. ఈ విహారాలన్నీ కట్ అయిపోతాయ్. అందుకే అలాంటి లైఫ్ స్టయిల్ మాకొద్దంటూ.. ఈ యంగ్ హీరోలు కామెంట్ చేశారట.

కాని నాని కూడా మధ్య మధ్యలో ఫారిన్ టూర్లు అవీ ఇవీ ఎంజాయ్ చేస్తూనే సినిమాలు చేస్తున్నాడనే అంటున్నారు సన్నిహితులు. మే బి మిగతా హీరోలు నాని తరహాలో ఫాస్టుగా కథలను ఓకే చేయలేకపోవడం వారికి పెద్ద మైనస్ కాని, ఈ లైఫ్‌ స్టయిల్ ఎఫెక్ట్ పెద్దగా కాదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English