‘సాహో’ టీం సర్ప్రైజ్ రెడీ

 ‘సాహో’ టీం సర్ప్రైజ్ రెడీ

‘సాహో’ సినిమా దాదాపు నాలుగేళ్ల నుంచి చర్చల్లో ఉంది. ‘బాహుబలి’ రిలీజ్ కాకముందే ఈ సినిమాకు సన్నాహాలు జరిగాయి. దర్శకుడు సుజీత్ తొలి సినిమా ‘రన్ రాజా రన్’ రిలీజైన కొన్ని నెలలకే ఈ ప్రాజెక్టు ఖరారైంది. కానీ ఇప్పటిదాకా ఇది ప్రేక్షకుల ముందుకు రాలేదు. షూటింగ్ మొదలై కూడా ఏడాదిన్నర అవుతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండటంతో దీని షూటింగ్ ఆలస్యమైంది. ఐతే ఎప్పటికప్పుడు అప్ డేట్స్‌తో అయినా ప్రభాస్ అభిమానుల్ని ఎంగేజ్ చేయాల్సింది.

కానీ యువి క్రియేషన్స్ ఈ విషయంలో అభిమానుల్ని నిరాశకు గురి చేస్తూనే ఉంది. చాలా లేటుగా అప్ డేట్స్ ఇస్తోంది. విశేషాలు పంచుకుంటోంది. ఒక దశలో యువి క్రియేషన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ప్రభాస్ ఫ్యాన్స్ గొడవ చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రెండు మేకింగ్ వీడియోలు వదిలాక మళ్లీ ‘సాహో’ టీం నుంచి ఏ విశేషం బయటికి రాలేదు.

ఐతే ఎట్లకేలకు చిత్ర బృందం మళ్లీ ఓ అప్ డేట్‌తో పలకరించబోతోంది. దీని గురించి స్వయంగా ప్రభాసే ఓ ప్రకటన చేశాడు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టిన ప్రభాస్.. ఆ అకౌంట్ నుంచే ‘సాహో’ లేటెస్ట్ సర్ప్రైజ్ గురించి ప్రకటన చేశాడు. మంగళవారం దీని గురించి వెల్లడించబోతున్నట్లు తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌‌ నుంచే ఈ సర్ప్రైజ్ వెల్లడవుతుందన్నాడు. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇప్పటి నుంచి ప్రమోషన్ల జోరు పెంచాల్సి ఉంది. ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌కు సమయం దగ్గర పడినట్లే.

మంగళవారం ఈ రెండింట్లో ఏదో ఒకదాని గురించి వెల్లడించే అవకాశముందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వచ్చే రెండున్నర నెలల్లో ‘సాహో’ టీం ప్రమోషన్లతో హోరెత్తించబోవడం ఖాయం అంటున్నారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుండగా.. నీల్ నితిన్ ముకేష్, అరుణ్ విజయ్, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English