దేవరకొండను పట్టుకుంటే వదలట్లేదు

దేవరకొండను పట్టుకుంటే వదలట్లేదు

గీతా ఆర్ట్స్ సంస్థ ఒకప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలతో మాత్రమే సినిమాలు తీసేది. వేరే హీరోలతో ఎప్పుడో కానీ ఒక చిత్రం చేసేది కాదు. అలాంటి సంస్థ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఒక యువ కథానాయకుడితో వరుసగా రెండు సినిమాలు నిర్మించింది. ఆ హీరో విజయ్ దేవరకొండనే. మెగా హీరోలతో భారీ చిత్రాలతో తీస్తే రాని లాభం ఈ రెండు సినిమాలతో వచ్చింది.

‘గీత గోవిందం’తో అల్లు అరవింద్ తన కెరీర్లోనే అత్యధిక లాభాలు అందుకోవడం విశేషం. ఈ సినిమా మొదలైనపుడే విజయ్ టాలెంట్ గుర్తించి ‘ట్యాక్సీవాలా’కు కూడా అతడిని కమిట్ చేశాడు. ఆ చిత్రం కూడా మంచి లాభాలు అందించింది. కుదిరితే విజయ్‌తో ఇంకో సినిమా కూడా తీయాలని గీతా ఆర్ట్స్ చూసింది కానీ.. విజయ్ వేరే కమిట్మెంట్లతో బిజీ అయిపోయాడు.

‘ట్యాక్సీవాలా’ తర్వాత విజయ్.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేశాడు. ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘డియర్ కామ్రేడ్’తో భారీగా లాభాలు చేసుకుంటున్న మైత్రీ సంస్థ సైతం విజయ్‌ను విడిచి పెట్టట్లేదు. వెంటనే అతడితో ఇంకో సినిమాకు కమిట్మెంట్ తీసుకుంది. ఆనంద్ అన్నామలై అనే కొత్త దర్శకుడు విజయ్‌తో తీయబోయే ‘హీరో’ చిత్రాన్ని కూడా ఆ బేనరే టేకప్ చేసింది. ఇంతకుముందు వైజయంతీ మూవీస్ సంస్థ సైతం విజయ్‌తో రెండు సినిమాలు చేసింది. వాటిలో అతను చేసింది లీడ్ రోల్స్ కాకపోయినప్పటికీ.. విజయ్‌తో మళ్లీ సినిమాలు చేయడానికి మాత్రం ఆ సంస్థ ఆసక్తి చూపించింది. అతను హీరోగా కూడా ఓ సినిమా చేయడానికి ఆల్రెడీ కమిట్మెంట్ తీసుకున్నారు.

ఇలా ఇప్పుడు విజయ్ ఉన్న ఊపులో ప్రతి బేనర్ కూడా అతడితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటోంది. అతను దొరికితే విడిచిపెట్టడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. అతడి నుంచి కమిట్మెంట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ప్రస్తుత యువ కథానాయకుల్లో ఇలాంటి క్రేజ్ ఇంకెవరికీ లేదనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English