ప్ర‌భుదేవా హీరో.. త‌మ‌న్నా హీరోయిన్.. ఒకే రోజు రెండు సినిమాలు

ప్ర‌భుదేవా హీరో.. త‌మ‌న్నా హీరోయిన్.. ఒకే రోజు రెండు సినిమాలు

ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ కావ‌డ‌మే అరుదు. 90ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలు నిప్పుర‌వ్వ‌, బంగారు బుల్లోడు ఒకే రోజు రిలీజ‌య్యాయి. ఆ త‌ర్వాత నాని ఆ ఫీట్ రిపీట్ చేశాడు. అత‌డి చిత్రాలు ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, జెండా పై క‌పిరాజు ఒకే రోజు విడులైన సంగ‌తి తెలిసిందే. ఐతే ఒక హీరో హీరోయిన్ క‌లిసి న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావ‌డం అన్న‌ది ఇప్ప‌టిదాకా ఎక్క‌డా జ‌రిగి ఉండ‌దేమో.

త్వ‌ర‌లో ఈ చిత్రం చూసే అవ‌కాశం రాబోతోంది. ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆ సినిమాలే.. దేవి-2 (తెలుగులో అభినేత్రి-2), కామోషి. ఈ రెండూ హార్రర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రాలు కావ‌డం మ‌రీ విచిత్రం.

మూడేళ్ల కింద‌ట వ‌చ్చిన 'అభినేత్రి'కి సీక్వెల్‌గా తెర‌కెక్కిన 'అభినేత్రి-2' ఈ నెల 1నే రావాల్సింది. కానీ ముందు వారం వ‌చ్చిన 'ఎవెంజ‌ర్స్ః ది ఎండ్ గేమ్'కు భయ‌ప‌డి వాయిదా వేశారు. త‌ర్వాత మే 31న కొత్త డేట్ ఇచ్చారు. ఇంత‌లో ప్ర‌భు-త‌మ‌న్నా న‌టించిన 'కామోషి' అనే సినిమా ఉన్న‌ట్లుండి తెర‌పైకి వ‌చ్చింది. ఈ చిత్రాన్ని కూడా మే 31నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. 'సాగ‌ర సంగ‌మం' చిత్రంలో బాల న‌టుడిగా న‌టించి.. కొన్నేళ్ల కింద‌ట 'ఈనాడు' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన చ‌క్రి తోలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎప్పుడో మొద‌లై.. ఈ మ‌ధ్యే పూర్త‌యింది.

'అభినేత్రి-2' రాబోతున్న స‌మ‌యంలోనే దీన్ని విడుద‌లకు సిద్ధం చేయ‌డం విడ్డూరంగా ఉంది. ఈ విష‌యంలో ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జోక్యం చేసుకుంటున్న‌ట్లు లేదు. మ‌రి నిర్మాత‌లైనా కాస్త చ‌ర్చించుకుని డేట్ క్లాష్ రాకుండా చూసుకోవాల్సింది. ఇప్ప‌టికైతే ఈ రెండు చిత్రాలూ ఒకే రోజు వ‌స్తాయ‌న్న స‌మాచారం ఉంది. మ‌రి డేట్ ద‌గ్గ‌ర ప‌డ్డాక ఏమైనా ప‌రిస్థితి మారుతుందేమో చూడాలి.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English