మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్‌లో మ‌హ‌ర్షి సంచ‌ల‌నం

మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్‌లో మ‌హ‌ర్షి సంచ‌ల‌నం

ఒక సినిమా ఒకే థియేట‌ర్లో కోటి రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం అరుదైన విష‌యం. తెలుగు సినిమాల‌కు హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఫేమ‌స్ థియేట‌ర్ల‌లో ఈ రేర్ ఫీట్ న‌మోద‌వుతుంటుంది. కానీ అందుకు చాలా రోజులు స‌మ‌యం ప‌డుతుంటుంది. 'బాహుబ‌లి' లాంటి సినిమాల్ని మిన‌హాయిస్తే ఎంత పెద్ద చిత్ర‌మైన‌ కోటి రూపాయ‌ల గ్రాస్ సాధించ‌డానికి ఐదారు వారాలైనా ప‌డుతుంది.

ఐతే మ‌హేష్ బాబు కొత్త చిత్రం 'మ‌హ‌ర్షి' ఒక మ‌ల్టీప్లెక్స్‌లో విడుద‌లైన ప‌ది రోజుల్లోనే కోటి రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఆ మ‌ల్టీప్లెక్స్ మ‌రేదో కాదు.. మ‌హేష్ బాబు సొంత‌మైన ఏఎంబీ సినిమాస్. ఈ మ‌ల్టీప్లెక్స్‌లో విడుద‌లైన రోజు నుంచి 'మ‌హర్షి'కి రోజుకు రెండంకెల సంఖ్య‌లో షోలు ప‌డుతున్నాయి. రెండో వారంలో కూడా అక్క‌డ సినిమా అద‌ర‌గొడుతోంది.

ఈ మ‌ల్టీప్లెక్స్‌కు ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి విప‌రీత‌మైన క్రేజ్ ఉంటోంది. ఇక్క‌డ సినిమా చూసేందుకు ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డుతున్నారు. మిగ‌తా థియేట‌ర్ల‌తో పోలిస్తే ఇక్క‌డ ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటోంది. ప్ర‌స్తుతం రెండో వీకెండ్లో కూడా 'మ‌హ‌ర్షి'కి ఇక్క‌డ అన్ని షోలూ హౌస్ ఫుల్స్ ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌ది రోజుల్లో కోటి రూపాయ‌ల గ్రాస్ అంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నేమీ లేదు.

ఇక ఓవ‌రాల్‌గా చూస్తే 'మ‌హ‌ర్షి' రూ.80 కోట్ల‌కు పైగా షేర్ సాధించి వంద కోట్ల వైపు అడుగులేస్తోంది. ఈ వారం 'ఏబీసీడీ' మిన‌హా చెప్పుకోద‌గ్గ సినిమాలు లేక‌పోవ‌డంతో రెండో వీకెండ్లో కూడా 'మ‌హ‌ర్షి'కి మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికీ అదే బాక్సాఫీస్ లీడ‌ర్‌గా కొన‌సాగుతోంది. ఫుల్ ర‌న్లో రూ.100 కోట్ల షేర్ సాధిస్తేనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English