దేవ‌ర‌కొండ కొత్త సినిమా.. ‘మ‌హ‌ర్షి’ క‌నెక్ష‌న్‌

దేవ‌ర‌కొండ కొత్త సినిమా.. ‘మ‌హ‌ర్షి’ క‌నెక్ష‌న్‌

ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో అత్యంత క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌డు. ద‌క్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లోనూ అత‌డికి క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి తెలుగు సినిమానే అయిన‌ప్ప‌టికీ.. అది వేరే భాష‌ల వాళ్ల‌కూ రీచ్ అయింది. విజ‌య్‌కి క్రేజ్ తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం విజ‌య్ హీరోగా తెర‌కెక్కే ప్ర‌తి సినిమానూ  ద‌క్షిణాది భాష‌ల‌న్నింట్లోనూ రిలీజ్ చేసుకునే వీలు ఉంటోంది.

టెక్నీషియ‌న్లు, న‌టీన‌టుల్ని కూడా అందుకు త‌గ్గ‌ట్లే ఎంచుకుంటున్నారు. 'డియ‌ర్ కామ్రేడ్'ను నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ‌హుభాషా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు ఉన్నారు. తాజాగా విజ‌య్ 'హీరో' అనే సినిమా మొద‌లైంది. దీని ద‌ర్శ‌కుడు ఆనంద్ అన్నామ‌లై త‌మిళుడు. క‌థానాయిక మ‌ల‌యాళ అమ్మాయి. త‌న పేరు మాళ‌విక మోహ‌న‌న్.

ఈ అమ్మాయి పేరు చివ‌ర‌న ఉన్న మోహ‌న‌న్ అనే పేరు ఈ మ‌ధ్య తెలుగు ప్రేక్ష‌కుల నోళ్ల‌లో బాగానే నానుతోంది. 'మ‌హ‌ర్షి' సినిమాకు ఛాయాగ్ర‌హ‌ణం అందించిన టెక్నీషియ‌న్ పేరు అదే. ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. మాళ‌వికకు తండ్రి. బాలీవుడ్లో భారీ సినిమాల‌కు ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఆయ‌న 'మ‌హ‌ర్షి'తో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యురాలు కూడా తెలుగులోకి వ‌స్తోంది. ఐతే మాళ‌విక ఆల్రెడీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మే.

ఆమె సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిత్రం 'పేట్ట‌'లో ఆయ‌న చెల్లెలిగా కీల‌క పాత్ర చేసింది. అందం, అభిన‌యం రెండూ ఉన్న మాళ‌విక వేరే సినిమాల‌తోనూ మంచి గుర్తింపే సంపాదించింది. ఆమె కెరీర్లో 'హీరో' బిగ్గెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. విజ‌య్ లాంటి క్రేజీ హీరో స‌ర‌స‌న, నాలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతున్న భారీ చిత్రంలో న‌టించ‌డం అంటే బంప‌రాఫ‌ర్ అన్న‌ట్లే. విజ‌య్-మాళ‌విక‌ల‌కు జోడీ బాగానే కుదిరే అవ‌కాశ‌ముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English