సాహో.. ప్ర‌భంజ‌నం ఖాయం

సాహో.. ప్ర‌భంజ‌నం ఖాయం

'బాహుబ‌లి'తో ప్ర‌భాస్ ఫాలోయింగ్, మార్కెట్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. 'బాహుబ‌లి'కి ముందు ప్ర‌భాస్ న‌టించిన 'మిర్చి' సినిమా బ‌డ్జెట్ రూ.30 కోట్లంటేనే ఎక్కువ అనిపించింది. దానికి రూ.40 కోట్ల దాకా షేర్ రావ‌డ‌మూ ఆశ్చ‌ర్య‌మే. కానీ ఇప్పుడు 'బాహుబ‌లి' త‌ర్వాత వ‌స్తున్న 'సాహో' చిత్రానికి రూ.200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెడుతున్నారు. దీని బిజినెస్ రూ.300 కోట్లు దాటుతోంది.

సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ రూ.500 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రానికి విప‌రీత‌మైన క్రేజ్ ఉండ‌టంతో అందుకు త‌గ్గ‌ట్లే రిలీజ్ కూడా భారీగా ఉండేలా చూసుకుంటోంది యువి క్రియేష‌న్స్ సంస్థ‌. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ఇప్ప‌టిదాకా ఏ భారతీయ చిత్రం రాని స్థాయిలో ఏకంగా 10 వేల స్క్రీన్ల‌లో రిలీజ్ కాబోతోంద‌ట‌.

ఇప్ప‌టిదాకా 'బాహుబ‌లి: ది కంక్లూజ‌న్' చిత్రానిదే రిలీజ్ ప‌రంగా రికార్డు. దాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9 వేల‌కు పైగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు. ఐతే అప్ప‌టితో పోలిస్తే ఇండియాలోనే స్క్రీన్లు పెరిగాయి. భార‌తీయ చిత్రాల‌కు అంత‌ర్జాతీయ మార్కెట్ కూడా విస్త‌రించింది. దేశం అవ‌త‌ల భార‌తీయ చిత్రాలు ఇంకా ఎక్కువ స్క్రీన్ల‌లో రిలీజ‌వుతున్నాయి. ఈ ఊపు 'సాహో'కు బాగానే క‌లిసొచ్చేలా ఉంది. ఆ చిత్రాన్ని దేశ్య‌వాప్తంగా మాగ్జిమం స్క్రీన్ల‌లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

విదేశాల్లోనూ భారీగా స్క్రీన్లు బుక్ చేస్తున్నార‌ట‌. 10 వేల స్క్రీన్ల క్ల‌బ్బులో చేరుతున్న తొలి చిత్రం 'సాహో'నే కావ‌డం తెలుగు సినిమాకే గ‌ర్వ‌కార‌ణం. ఇంత భారీగా రిలీజ‌వుతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ఓపెనింగ్స్ సాధిస్తుంద‌న్న‌ది కూడా అంచ‌నా వేయొచ్చు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రికార్డ‌లు మోత మోగ‌డం ఖాయ‌మేమో. ఆగ‌స్టు 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English