తనికెళ్ల భరణి.. రాళ్లపల్లి.. ఓ పాలపీక కథ

తనికెళ్ల భరణి.. రాళ్లపల్లి.. ఓ పాలపీక కథ

రాళ్లపల్లి నరసింహారావు.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. ‘సితార’.. ‘అన్వేషణ’.. ‘లేడీస్ టైటర్’ సహా సహా ఎన్నో చిత్రాల్లో తన సహజ నటనతో ప్రేక్షకుల్ని మైమరిపించిన ఈ దిగ్గజ నటుడు అనారోగ్యంతో కన్ను మూశారు. నటుడిగానే కాక వ్యక్తిగానూ సినీ పరిశ్రమలో ఆయనకు చాలా మంచి పేరుంది. నాటక రంగం నుంచి సినిమా వైపు వచ్చిన ఆయనకు ఇక్కడ ఎందరో శిష్యులున్నారు. ఆ శిష్యుల్లో తనికెళ్ల భరణి అగ్రగణ్యుడు.

నటుడిగా, రచయితగా తనకు స్ఫూర్తి రాళ్లపల్లే అంటారు భరణి. వ్యక్తిగతంగా కూడా ఆయనతో భరణికి గొప్ప అనుభంధం ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల్లో కష్టాల్లో ఉన్న భరణిని రాళ్లపల్లి ఎన్నోసార్లు ఆదుకున్నారట. తన బిడ్డకు పాల పీక కొనలేక ఇబ్బంది పడ్డ ఓ సందర్భంలో రాళ్లపల్లి తనను ఆదుకున్న విధానాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు భరణి.

తన తన భార్య, పాపతో కలిసి ఒక ఫంక్షన్‌కు బయల్దేరామని.. అప్పుడే రాళ్లపల్లి తమ ఇంటికి వచ్చారని.. ఐతే తమ పాప నోట్లో ఉన్న పాల పీక ఎక్కడో పడిపోయిందని.. దీంతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టిందని.. పాల పీక కొందామని ఇంట్లో డబ్బుల కోసం వెతికితే ఎక్కడా నయా పైసా దొరకలేదని భరణి చెప్పారు. అప్పటికి పాల పీక ధర పావలానే అని.. కానీ అది కొనడానికి కూడా తమ దగ్గర డబ్బులు లేని దుస్థితి అని.. అది తెలిసి రాళ్లపల్లి అప్పటికప్పుడు ఓ ఫ్రెండు ఇంటికి వెళ్లి 20 రూపాయలు తీసుకొచ్చారని.. పాల పీక కొనివ్వడంతో పాటు మిగతా డబ్బులన్నీ కూడా ఖర్చు చేసి ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చి ఇచ్చారని భరణి చెప్పారు.

ఇలా పలు సందర్భాల్లో తనను రాళ్లపల్లి ఆదుకున్నట్లు ఆయన వెల్లడించారు. నాటక రంగం నుంచి రాళ్లపల్లితో తనకు పరిచయం ఉందని.. ఆయన స్ఫూర్తితోనే తాను సినీ రంగంలోకి వచ్చినట్లు భరణి చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English