దేవిశ్రీ పాట రాస్తే.. సిరివెన్నెల ఫిదా అయిన వేళ

దేవిశ్రీ పాట రాస్తే.. సిరివెన్నెల ఫిదా అయిన వేళ

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన్నుంచి ఒక కాంప్లిమెంట్ వస్తే దాన్ని సర్టిఫికెట్ లాగా బావిస్తారు వేరే గేయ రచయితలు. అలాంటి వ్యక్తి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. రాసిన పార్ట్ టైం పాటకు ఫిదా అయిపోయారట. దాని గురించి ఒక వ్యాసమే రాయడానికి కూడా రెడీ అయిపోయారట. ఇంతకీ ఆ పాట ఏదంటారా... ‘సన్నాఫ్ సత్యమూర్తి’లోని ‘సూపర్ మచ్చి’. ఈ పాట విని సిరివెన్నెల వారు ఇచ్చిన కామెంట్‌ను తాను ఎప్పటికీ మరిచిపోలేనని దేవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

‘‘సిరివెన్నెల గారు ఈ పాట విని.. ‘నాన్నా.. నేను మాస్ పాటలు, ఐటెం సాంగ్స్ రాయకూడదని చాలా రోజుల కిందటే అనుకున్నా. కానీ నీ పాట విన్నాక మళ్లీ మాస్ పాటలు రాయాలనే కోరిక కలిగింది’ అని సిరివెన్నెల తనతో అన్నట్లు దేవి చెప్పాడు. అందులోనూ ఈ పాటలో ‘సండే సంత కాడ.. మండే ఎండలోన’ అనే ప్రాస విని సిరివెన్నెల వారు ఫిదా అయిపోయారని.. దీనిపై ఒక వ్యాసం రాసి ఇస్తానని అన్నారని.. అది వర్ధమాన గేయ రచయితలకు గైడెన్స్ లాగా ఉపయోగపడుతుందని చెప్పారని దేవి చెప్పాడు.

నిజానికి ‘సూపర్ మచ్చి’ పాటను పూర్తిగా తాను రాయాలన్న ఉద్దేశం ఏమీ లేదని.. ఊరికే ట్యూన్ కోసం పల్లవి వరకు రాసుకెళ్లి దర్శకుడు త్రివిక్రమ్‌కు వినిపించానని.. ‘‘ఎలా రాశావు స్వామీ ఇలా’’ అంటూ ఆయన ఆశ్చర్యపోయారని.. తర్వాత ఆయన పట్టుబడితే చరణాలు కూడా రాశానని చెప్పాడు దేవి. ఆపై సిరివెన్నెల వారికి చూపిస్తే ఆయన కూడా పాట విని ఆశ్చర్యపోయినట్లు దేవి చెప్పాడు. తాను పెద్దగా పుస్తకాలు చదవలేదని.. తనకు తోచినట్లు ఏదో రాసేస్తుంటానని అన్నాడు దేవి. అతను ఇప్పటిదాకా ఆరేడు పాటల దాకా రాశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English