నేను మీకు చెప్పానా అంటున్న అంజలి

నేను మీకు చెప్పానా అంటున్న అంజలి

తమిళ సినిమాల్లో పేరు తెచ్చుకున్న తెలుగు నటి అంజలి.. జై అనే నటుడితో కొంత కాలం ప్రేమాయణం నడిపిన సంగతి బహిరంగ రహస్యం. జ్యోతిక నటించిన ఓ చిత్ర ప్రమోషన్లలో భాగంగా భార్య కోసం భర్త దోసె వేసి ఇస్తున్న దృశ్యాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలంటూ సూర్య ఛాలెంజ్ విసిరితే అంజలి కోసం జై ఈ పని చేసి పెట్టాడు.

అప్పటికి జై, అంజలి సహజీవనంలో ఉన్నారని.. అంజలి కాబోయే భర్తగా అతను ఈ ఛాలెంజ్ తీసుకున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. ఐతే జై నుంచి అంజలి తర్వాత విడిపోయిన మాట కూడా వాస్తవమే. కానీ తమ మధ్య ఇంతకుముందు ఏమీ లేనట్లుగా అంజలి మాట్లాడుతుండటం విచిత్రం.

తాజాగా తన కొత్త సినిమా ‘లిసా’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అంజలి మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఓ తమిళ కథానాయకుడితో మీరు ఇంతకుముందు ప్రేమలో ఉన్నారు కదా అని అడిగితే.. అంజలి చిత్రంగా స్పందించింది. నేను ప్రేమలో ఉన్న సంగతి ఎవరికైనా చెప్పానా అని ప్రశ్నించింది. తాను చెప్పని ఏ విషయం గురించీ తాను స్పందించనని ఆమె తేల్చి చెప్పింది. ‘‘నేను చెప్పని దేనికీ నేను బాధ్యత తీసుకోను. స్పందించను. ఏదైనా ఉంటే నేనే నిజాయితీగా ప్రకటిస్తాను.

నేను దాని గురించి మాట్లాడటం లేదంటే.. ఏమీ ప్రకటించలేదనే అర్థం. అంతే. నా జీవితంలో ఏం జరుగుతోందనే విషయం నా కుటుంబానికి తప్పకుండా తెలుస్తుంది. నేనైనా నా గురించి వచ్చే వార్తలన్నింటినీ చదవను. కొన్నిసార్లు నా కుటుంబ సభ్యులు, కజిన్స్ అవి చూసి కంగారు పడుతుంటారు. నా కజిన్ ఒకరు తెలుగులో టీవీ న్యూస్ రీడర్. ఆమె వచ్చి నీ గురించి ఫలానా వార్త చదివా అంటుంది. నేను లైట్ తీసుకుంటా’’ అని అంజలి చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్ అని.. ఏ రిలేషన్‌షిప్‌లో లేనని మాత్రం అంజలి స్పష్టం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English