సమంత సినిమాకు ఏమైంది?

సమంత సినిమాకు ఏమైంది?

పెళ్లయ్యాక కూడా ఏమాత్రం స్పీడు తగ్గించకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది సమంత. పెళ్లి తర్వాతే ఆమె ఒకటికి రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. అందులో ఒకటి ‘యు టర్న్’ గత ఏడాదే విడుదలైంది. ఇప్పుడు ‘ఓ బేబీ’ పేరుతో ఓ కొరియన్ మూవీ రీమేక్‌లో సామ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా సమాచారం బయటికి వచ్చింది. చిత్ర బృందం అధికారికంగానే ఈ విషయాన్ని వెల్లడించింది. కానీ ఆ తర్వాత అప్ డేట్ లేదు.

ఈపాటికే రిలీజ్ కావాల్సిన సినిమా గురించి ఏ సమాచారం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐతే ఔట్ పుట్ విషయంలో అసంతృప్తి వల్ల ఈ సినిమాకు బ్రేక్ పడినట్లుగా వార్తలొస్తున్నాయి. దర్శకురాలు నందిని రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సినిమా షూటింగ్ పూర్తి చేయించిన నిర్మాత సురేష్ బాబు.. ఔట్ పుట్ చూసి బాగా నిరాశ చెందారట.

అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ‘మిస్ గ్రానీ’కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే అంత అద్భుతమైన చిత్రాన్ని నందిని సరిగా డీల్ చేయలేకపోయిందని.. ఆమె తీసిన వెర్షన్ ఉన్నదున్నట్లుగా రిలీజ్ చేయడం కష్టమని సురేష్ బాబు అభిప్రాయపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని పోర్షన్లు రీషూట్ చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారట. అదనపు ఖర్చు అయినా పర్వాలేదని.. కానీ ఇప్పుడున్న వెర్షన్ రిలీజ్ చేస్తే తమ బేనర్ వాల్యూ దెబ్బ తింటుందని ఆయన తేల్చి చెప్పారట.

మళ్లీ సమంత డేట్లు సర్దుబాటు చేసుకుని రీషూట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం ఇంకో రెండు మూడు నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్ర పోషించింది. సమంత ఇందులో వృద్ధురాలిగా ఓ షాకింగ్‌ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English