అఖిల్ సినిమా ఆగడానికి హీరోయిన్స్ కారణం కాదట

అఖిల్ సినిమా ఆగడానికి హీరోయిన్స్ కారణం కాదట

అక్కినేని మూడో తరం హీరో అఖిల్‌కు కాలం కలిసి రావడం లేదు. చిన్నప్పుడే ‘సిసింద్రీ’ సినిమాతో మెప్పించిన అతడు.. హీరోగా మాత్రం ఒక్క హిట్‌నూ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. హీరోగా చేసిన మొదటి చిత్రం ‘అఖిల్’ నుంచి పాఠం నేర్చుకుని, రీ లాంచింగ్ మూవీ అంటూ ‘హలో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా నిరాశపరిచింది. ఇక, ఈ మధ్య వచ్చిన ‘మిస్టర్ మజ్నూ’ కూడా అఖిల్‌ను హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. ఆకట్టుకునే అందం.. ఫిజిక్.. నటన ఉన్నా.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అతడు చేసిన మూడు ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. దీంతో ఈ సారి చేయబోయే సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయిపోయాడు అక్కినేని వారి అబ్బాయి.

 ప్రస్తుతం అఖిల్.. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయడానికి సంతకం పెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. కానీ, కొద్దిరోజులుగా అఖిల్ సరసన నటింపజేసే హీరోయిన్ ఇంకా ఓకే కాలేదని, అందుకే ఈ సినిమా పట్టాలెక్కలేదని వార్తలు వస్తున్నాయి. ఇందులో అఖిల్ సరసన కియారా అద్వానీని తీసుకుంటున్నారని, కాదు కాదు.. రష్మిక మందన్నాను ఓకే చేశారని ప్రచారం జరిగింది. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడానికి హీరోయిన్ కారణం కాదని తెలిసింది. దీనికి కారణం కథ పూర్తి కాకపోవడమేనని సమాచారం.

 ఈ సినిమాకు సంబంధించినంత వరకు అన్నీ సెట్ అయినప్పటికీ.. కథ విషయంలో క్లారిటీ రావడం లేదట. ఇంటర్వెల్ వరకు ఈ సినిమా కథ సూపర్‌గా ఉన్నా సెకండ్ హాఫ్ పూర్తి కాలేదని తెలిసింది. దీంతో ఇద్దరు ముగ్గురు రచయితలను సంప్రదించారట. అయినా ఏం లాభం లేదని సమాచారం. సినిమా మొదలుపెట్టేసి కథ తర్వాత రాసుకుందామని అనుకున్నప్పటికీ, అది వర్కౌట్ కాదేమోననే ఉద్దేశ్యంతోనే సినిమాను ప్రారంభించడం లేదని తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్‌కు గతంలో తగిలిన దెబ్బల వల్లే ఈ సినిమాను ఇంత జాగ్రత్తగా తీయాలని డిసైడ్ అయ్యాడట. ఆయన టాలీవుడ్‌లో బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త అనే సినిమాలను చేసిన విషయం తెలిసిందే. వీటిలో చివరి రెండు ఘోర పరాజయం పాలయ్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English